Share News

Farmers protest: మా సోషల్ మీడియా అకౌంట్లు సస్పెండ్ చేశారు.. రైతు నేతలు ఆగ్రహం

ABN , Publish Date - Feb 16 , 2024 | 08:19 PM

డిమాండ్ల సాధనకు ఉద్యమిస్తు్న్న అన్నదాతల గొంతు అణిచివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని రైతు నేతలు శుక్రవారంనాడు ఆరోపించారు. రైతులు, యూట్యూబర్ల సోషల్ మీడియా అకౌంట్లను కేంద్రం సస్పెండ్ చేసినట్టు రైతు నేత ర్వణ్ సింగ్ పాంథెర్ ఆరోపించారు. ఆరోపించారు

Farmers protest: మా సోషల్ మీడియా అకౌంట్లు సస్పెండ్ చేశారు.. రైతు నేతలు ఆగ్రహం

న్యూఢిల్లీ: డిమాండ్ల సాధనకు ఉద్యమిస్తు్న్న అన్నదాతల గొంతు అణిచివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని రైతు నేతలు శుక్రవారంనాడు ఆరోపించారు. మరోవైపు, సమస్య పరిష్కారానికి రైతు ప్రతినిధులు, కేంద్ర మంత్రుల మధ్య శుక్రవారంనాడు జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిసాయి. అనంతరం మీడియాతో రైతు నేత శర్వణ్ సింగ్ పాంథెర్ (Sarwan Singh Pandher ) మాట్లాడుతూ, సమస్యల పరిష్కారానికి తాము చేపట్టిన ఆందోళనలను చూపించకుండా రైతులు, యూట్యూబర్ల సోషల్ మీడియా అకౌంట్లను కేంద్రం సస్పెండ్ చేసినట్టు ఆరోపించారు. పంటల కనీస మద్దతు ధరకు (MSP) చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్ సహా పలు డిమాండ్లపై ఢిల్లీకి శాంతియుతంగా వెళ్తు్న్న ప్రదర్శకులపై కేంద్ర బలప్రయోగం చేస్తోందని అన్నారు.


ఛల్లో ఢిల్లీ పిలుపు మేరకు ఆందోళనలో పాలుపంచుకుంటున్న రైతులను భద్రతా బలగాలు అడ్డుకోవడం, టియర్ గ్యాస్ ప్రయోగం చేస్తుండటంతో నాలుగోరోజు కూడా పెద్దఎత్తున రైతులు పంజాబ్-హర్యానా సరిహద్దుల్లోని శంభు, ఖనౌరి పాయింట్ల వద్దే ఉండిపోయారు. రైతులపై బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగంతో సుమారు 70 మంది రైతులు గాయపడినట్టు పాంథెర్ తెలిపారు. రైతులపై ప్రయోగించిన టియర్ గ్యాస్ షెల్స్‌ను కూడా కేంద్రంతో జరిగిన చర్చల్లో తాము మంత్రులకు చూపించామని అన్నారు. ఎంఎస్‌పీపై చట్టం, రుణాల మాఫీ, పెన్షన్లు, లఖింపూర్ ఖేరి హింసాకాండలో బాధితులకు న్యాయం చేయాలనే డిమాండ్లపై చర్చించామన్నారు. కాగా, చర్చల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఫిబ్రవరి 18వ తేదీన మరోసారి సమావేశం కావాలని ఇరువర్గాలు నిర్ణయించాయి.

Updated Date - Feb 16 , 2024 | 08:19 PM