Share News

Mohan Bhagwat: సంతానోత్పత్తి రేటు తగ్గుదలపై మోహన్ భగవత్ ఆందోళన

ABN , Publish Date - Dec 01 , 2024 | 04:39 PM

జనాభా తగ్గడంతో పలు సమాజాలు, భాషలు ఇప్పటికే ఉనికి కోల్పోయాయని మోహన్ భగవత్ హెచ్చరించారు. 1998 లేదా 2002లో భారత జనాభా విధానం రూపొందిందని, 2.1 శాతానికి కంటే సంతోనోత్పత్తి పడిపోకుండా చూడాల్సిన అవసరాన్ని కూడా గుర్తించిందని చెప్పారు.

Mohan Bhagwat: సంతానోత్పత్తి రేటు తగ్గుదలపై మోహన్ భగవత్ ఆందోళన

నాగపూర్: భారతదేశ జనాభా వృద్ధి రేటు (Fertility Rate) తగ్గుతుండటం, తద్వారా సామాజిక మనుగడ విషయంలో తలెత్తే చిక్కులపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) ఛీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) ఆందోళన వ్యక్తం చేశారు. నాగపూర్‌లో ఆదివారంనాడు ఆర్ఎస్ఎస్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సంతానోత్పత్తి రేటు 2.1 శాతానికి మించి ఉండాలని ఆధునిక జనాభా శాస్త్రం తేల్చిచెబుతోందని అన్నారు.

Delhi Assembly Elections: కేజ్రీవాల్ బిగ్ అనౌన్స్‌మెంట్


''జనాభా తగ్గుదల ఆందోళన కలిగించే అంశం. సమాజంలో సంతానోత్పత్తి రేటు 2.1 శాంత కంటే తక్కువగా ఉంటే ఆ సమాజం ఎలాంటి సంక్షోభం అవసరం లేకుండానే అదృశ్యమవుతుందని ఆధునిక జనాభా శాస్త్రం చెబుతోంది'' అని భగవత్ అన్నారు. జనాభా తగ్గడంతో పలు సమాజాలు, భాషలు ఇప్పటికే ఉనికి కోల్పోయాయని హెచ్చరించారు. 1998 లేదా 2002లో భారత జనాభా విధానం రూపొందిందని, 2.1 శాతానికి కంటే సంతోనోత్పత్తి పడిపోకుండా చూడాల్సిన అవసరాన్ని కూడా గుర్తించిందని చెప్పారు.


ఇద్దరు లేదా ముగ్గురు

''సమాజం మనుగడ సాధించాలంటే ఇద్దరు లేదా ముగ్గురి అవసరం ఉంది. జనాభా శాస్త్రం చెబుతున్నది కూడా ఇదే. ఈ సంఖ్య చాలా ముఖ్యం. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. జనాభా వృద్ధి రేటు తక్కుముఖం పట్టడం సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదు'' అని భగవత్ అన్నారు.


జనాభా నియంత్రణ చట్టం

జనాభా నియంత్రణ చట్టం తీసుకురావాలంటూ పలువురు బీజేపీ నేతలు ఇటీవల కాలంలో వ్యాఖ్యానించిన నేపథ్యంలో మోహన్ భగవత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాజస్థాన్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే బాల్‌ముకుందాచార్య ఇటీవల మాట్లాడుతూ, జనాభా సమత్యులత, అభివృద్ధి కోసం జనాభా నియంత్రణ చట్టం తీసుకురావాలని అన్నారు. ''నలుగురు భార్యలు, 36 మంది సంతానాన్ని అనుమతించ కూడదు'' అని ఒక వర్గాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. జనాభా నియంత్రణ పేరుతో నిర్దిష్ట వర్గాన్ని బీజేపీ టార్గెట్‌గా చేసుకుంటోందని, ఎలాంటి వివక్షకు తావులేని జనాభా నియంత్రణకు తమ మద్దతు ఉంటుందని తెలిపింది.


దేశ జనాభా తగ్గుదల రేటు ఎలా ఉంది?

స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ దేశ సంతోనాత్పత్తి రేటు తగ్గుతోంది. 1950లో ఫెర్టిలిటీ రేటు ఒక్కో మహిళలకు 6.2 కంటే ఎక్కువగా ఉండేది. ఇటీవల కాలంలో అది 2.1 శాతానికి పడిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే 2050 నాటికి దేశ సంతానోత్పత్తి రేటు కేవలం 1.3కి పడిపోతుందని నిపుణులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి

Fire Accident: 61 మంది భక్తులతో వెళ్తున్న బస్సుకు భారీ అగ్ని ప్రమాదం.. చివరకు..

Heavy Raind: చెన్నై నగరాన్ని ముంచెత్తిన ‘ఫెంగల్’..

Read More National News and Latest Telugu News

Updated Date - Dec 01 , 2024 | 04:39 PM