Sri Ramulu: భారతదేశంలో ఉంటూ పాకిస్తాన్‌కు జై కొడతారా..? సిగ్గులేదా..?
ABN , Publish Date - Mar 01 , 2024 | 01:26 PM
ఇండియాలో ఉంటూ.. ఇక్కడి గాలి పీలుస్తూ.. పాకిస్తాన్ జిందాబాద్ అనేందుకు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు నాసీర్ హుసేన్ కు సిగ్గుగా లేదా అని బీజేపీ నాయకుడు మాజీ మంత్రి శ్రీరాములు(Former Minister Sri Ramulu) ప్రశ్నించారు.
- మాజీ మంత్రి శ్రీరాములు ఆగ్రహం
బళ్లారి(బెంగళూరు): ఇండియాలో ఉంటూ.. ఇక్కడి గాలి పీలుస్తూ.. పాకిస్తాన్ జిందాబాద్ అనేందుకు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు నాసీర్ హుసేన్ కు సిగ్గుగా లేదా అని బీజేపీ నాయకుడు మాజీ మంత్రి శ్రీరాములు(Former Minister Sri Ramulu) ప్రశ్నించారు. శుక్రవారం శ్రీరాములు నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విధానసౌధలో ఎంపీ నాసీర్ హుసేన్ అనుచరులు, పాకిస్తాన్ జిందాబాద్ అనడం వీడియాల్లో చూశా నన్నారు. కాంగ్రెస్ నాయకులు దేశద్రోహానికి పాల్పడడం సిగ్గుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గాలి జనార్దన్‌రెడ్డి(Gali Janardhan Reddy) బీజేపీలోకి వస్తే స్వాగతిస్తానన్నారు. తన సోదరి శాంత హిందూపురం ఎంపీగా పోటీ చేయడంపై ప్రశ్నించగా అది వారి మెట్టినింటి వ్యవహారమన్నారు. విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు ఓబుళేశ్, మాజీ బుడా అధ్యక్షుడు మారుతీ ప్రసాద్, తిమ్మప్ప పాల్గొన్నారు.