Share News

Rahul Gandhi: రాహుల్ గాంధీ కారుపై రాళ్ల దాడి..భారత్ జోడో న్యాయ యాత్రకు బ్రేక్!

ABN , Publish Date - Jan 31 , 2024 | 02:47 PM

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ యాత్ర కాన్వాయ్‌పై ఈరోజు బెంగాల్, బీహార్ సరిహద్దులో దాడి జరిగింది. దీంతో పలువురు కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ యాత్రకు పదే పదే ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

Rahul Gandhi: రాహుల్ గాంధీ కారుపై రాళ్ల దాడి..భారత్ జోడో న్యాయ యాత్రకు బ్రేక్!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ యాత్ర కాన్వాయ్‌పై ఈరోజు బెంగాల్, బీహార్ సరిహద్దులో దాడి జరిగింది. బెంగాల్‌లోని మాల్దాలో ఈ ఘటన చోటుచేసుకోగా.. గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో రాయి విసరడంతో కారు వెనుక అద్దాలు పగిలిపోయాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ విషయాన్ని పశ్చిమ బెంగాల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ అధిర్‌ రంజన్‌ చౌదరి వెల్లడించారు.

మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: INDIA bloc: ఆ పేరు వద్దని చెప్పినా వినలేదు: నితీష్ కుమార్


ఈ ఘటన నేపథ్యంలో మాల్దాలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కాన్వాయ్‌ను కొందరు టార్గెట్ చేశారని అక్కడి నేతలు పేర్కొన్నారు. ఈ దాడి ఘటన వెనుక అధికార పార్టీకి సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు. రాహుల్ ‘న్యాయ యాత్ర’కు పదే పదే అడ్డంకులు జరుగుతున్న నేపథ్యంలో తగిన భద్రత కల్పించాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లేఖ పంపారు.

ఈ క్రమంలోనే మాల్దాలోకి ప్రవేశించిన తర్వాతే అయన భయాలు నిజమయ్యాయి. బెంగాల్‌-బీహార్‌ సరిహద్దుల్లో ఈ దాడికి పాల్పడింది ఎవరన్నదానిపై విచారణ జరపాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ప్రదీప్‌ భట్టాచార్య డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు.

మరోవైపు తృణమూల్ ప్రభుత్వం ఈ యాత్రకు సహకరించడం లేదని కాంగ్రెస్ ఆరోపించింది. ముర్షిదాబాద్ జిల్లాలోకి అడుగుపెట్టిన తర్వాత రాహుల్ బస చేయాల్సిన స్టేడియానికి కూడా అనుమతి ఇవ్వలేదని కాంగ్రెస్ తెలిపింది. ఇది కుట్రలో భాగంగానే జరిగిందని ఆరోపించింది.

Updated Date - Jan 31 , 2024 | 02:47 PM