Indian doctors: భారత్‌లో సగం అనవసర ప్రిస్ర్కిప్షన్లే..!
ABN , Publish Date - Jul 11 , 2024 | 05:28 AM
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేతలు పంజాబ్, గోవా ఎన్నికల ఖర్చుల కోసం అదనంగా రూ.100 కోట్లను డిమాండ్ చేసినట్లు ఈడీ ఆరోపించింది.
న్యూఢిల్లీ, జూలై 10: భారత్‌లో వైద్యులు సూచిస్తున్న ప్రతి రెండు మెడికల్ ప్రిస్ర్కిప్షన్లలో ఒకటి ప్రామాణిక మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉందని ఎయిమ్స్ పరిశోధకుల బృందం నిర్వహించిన అధ్యయనంలో తేలింది. వాటిలో దాదాపు పదో వంతు ప్రిస్ర్కిప్షన్లు అసలు ఆమోదయోగ్యంగా లేవని గుర్తించింది. 2019 ఆగస్టు నుంచి 2020 ఆగస్టు మధ్య వైద్యులు జారీచేసిన 4,838 ప్రిస్ర్కిప్షన్లను ఈ బృందం విశ్లేషించింది. ఐసీఎంఆర్ ఏర్పాటు చేసిన రేషనల్ యూజ్ ఆప్ మెడిసిన్స్ సెంటర్ (ఆర్‌యూఎంసీ)ల నుంచి ఈ ప్రిస్ర్కిప్షన్లను సేకరించారు. ఈ క్రమంలో 475 ప్రిస్ర్కిప్షన్లు ప్రామాణిక మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నాయని, వాటిలో 54 ప్రిస్ర్కిప్షన్లలో పాంటోప్రజోల్‌ను వైద్యులు చాలా తరచుగా సూచించారని గుర్తించారు.
475 ప్రిస్ర్కిప్షన్లలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, బీపీకి సంబంధించిన మందులు అధికంగా రాశారని, దీనికోసం రాబెప్రజోల్ + డోంపెరిడోన్ ట్యాబ్లెట్లను సూచించారని, ఇది ఆమోదయోగ్యం కాని కాంబినేషన్ అని వైద్యుల బృందం తెలిపింది. ఈ ప్రిస్ర్కిప్షన్ల వలన రోగులకు దుష్ప్రభావాలు కలగడమే కాకుండా చికిత్స ఖర్చు పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. రోగికి గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంటే గ్యాస్ట్రోప్రొటెక్టివ్ మందులను సూచించాలని, పాంటోప్రజోల్‌ను అనవసరంగా సూచించడం వలన దుష్ప్రభావాలు ఎదురవుతాయని పేర్కొంది. కాగా.. దాదాపు 55ు మంది వైద్యులు మాత్రమే ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా మందులు సూచిస్తున్నారని వెల్లడించింది.