Share News

Siddharth Luthra: వరద బాధితులకు చేయూతనిద్దాం

ABN , Publish Date - Sep 29 , 2024 | 03:45 AM

తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు చేయూతనిద్దామని సుప్రీం కోర్టు అడ్వకేట్‌ ఆన్‌ రికార్డ్‌ అసోసియేషన్‌ (ఎస్సీవోఆర్‌ఏ) వెల్ఫేర్‌

Siddharth Luthra: వరద బాధితులకు చేయూతనిద్దాం

  • తెలంగాణ, ఏపీలకు ఆర్థిక భరోసా కల్పిద్దాం

  • ఎస్సీఏవోఆర్‌ఏ వెల్ఫేర్‌ మేనేజింగ్‌ ట్రస్టీ సిద్ధార్థ్‌ లూథ్రా

న్యూఢిల్లీ, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు చేయూతనిద్దామని సుప్రీం కోర్టు అడ్వకేట్‌ ఆన్‌ రికార్డ్‌ అసోసియేషన్‌ (ఎస్సీవోఆర్‌ఏ) వెల్ఫేర్‌ మేనేజింగ్‌ ట్రస్టీ, సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా సభ్యులను కోరారు. ఈ మేరకు శనివారం వారిని ఉద్దేశించి లేఖ రాశారు.


తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు చేపడుతున్న సహాయక చర్యలకు మద్దతుగా నిలిచేందుకు సహకరించాలని ట్రస్టు సభ్యులకు పిలుపునిచ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అనేక మంది ఇళ్లు, జీవనోపాధి కోల్పోయారని పేర్కొన్నారు. ట్రస్టుకు లేదా రెండు రాష్ట్రాల సీఎం సహాయ నిధికి సభ్యులు ఆర్థిక సాయం చేయవచ్చని సిద్ధార్థ్‌ లూథ్రా స్పష్టం చేశారు.

Updated Date - Sep 29 , 2024 | 03:45 AM