Patanjali: రామ్ దేవ్ బాబాకు సుప్రీం సమన్లు.. ఆదేశాలు ఎలా ఉల్లంఘిస్తారంటూ ఫైర్..
ABN , Publish Date - Mar 19 , 2024 | 12:01 PM
పతంజలి ఆయుర్వేదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ( Supreme Court ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో ధిక్కార నోటీసుపై స్పందించడంలో విఫలమయ్యారంటూ ధర్మాసనం మండిపడింది.
పతంజలి ఆయుర్వేదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ( Supreme Court ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో ధిక్కార నోటీసుపై స్పందించడంలో విఫలమయ్యారంటూ ధర్మాసనం మండిపడింది. సహ వ్యవస్థాపకుడు, యోగా గురు రామ్‌దేవ్ బాబాతో పాటు మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణకు సమన్లుజారీ చేసింది.తమ ఉత్పత్తులు, వాటి ఔషధ సమర్థతను క్లెయిమ్ చేసే ప్రకటనల గురించి కోర్టులో ఇచ్చిన హామీని ఉల్లంఘించారని కోర్టు వ్యాఖ్యానించింది. పతంజలిపై ఎందుకు ధిక్కార చర్యలు తీసుకోకూడదో చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది.
పతంజలి ఆయుర్వేదం తప్పుదారి పట్టించే ప్రకటనలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. గతంలో జరిగిన విచారణలో తప్పుడు ప్రకటనలను ప్రచురించవద్దని పతంజలిని న్యాయస్థానం ఆదేశించింది. ఉల్లంఘిస్తే కోటి రూపాయలు జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చింది. అల్లోపతి వంటి ఆధునిక వైద్య విధానాలకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చినందుకు బాబా రామ్‌దేవ్ పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.