Share News

Supreme Court of India: పార్టీల హామీలపై సుప్రీంకోర్టు సంచలన కామెంట్స్...

ABN , Publish Date - May 27 , 2024 | 04:51 PM

Supreme Court of India: ఎన్నికల(Elections) సమయంలో రాజకీయ పార్టీలు(Political Parties) ఇచ్చే హామీలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన కామెంట్స్ చేసింది. పార్టీలు ఇచ్చే హామీలు అవినీతిగా పరిగణించలేమని స్పష్టం చేసింది సుప్రీం ధర్మాసనం(Supreme Court). ఎన్నికల్లో పార్టీలు చేసే వాగ్ధానాలు అవినీతి కిందకు రాదని తెలిపింది.

Supreme Court of India: పార్టీల హామీలపై సుప్రీంకోర్టు సంచలన కామెంట్స్...
Supreme Court of India

Supreme Court of India: ఎన్నికల(Elections) సమయంలో రాజకీయ పార్టీలు(Political Parties) ఇచ్చే హామీలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన కామెంట్స్ చేసింది. పార్టీలు ఇచ్చే హామీలు అవినీతిగా పరిగణించలేమని స్పష్టం చేసింది సుప్రీం ధర్మాసనం(Supreme Court). ఎన్నికల్లో పార్టీలు చేసే వాగ్ధానాలు అవినీతి కిందకు రాదని తెలిపింది. హామీలు ఇవ్వడమే అవినీతికి కిందకు వస్తుందంటూ సుప్రీంకోర్టులో కొందరు పిల్ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. పిల్‌ను విచారణకు అంగీకరించలేదు. పార్టీల మేనిఫెస్టోల్లోని హామీలను ప్రజలు నమ్మితే ఎవరేం చేస్తారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీనిని అవినీతిగా పరిగణించలేమని పిల్‌ను తోసిపుచ్చింది.


రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలను అవినీతిలో భాగంగా పరిగణించాలని కోరుతూ కొందరు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. రాజకీయ పార్టీలు అధికారం చేపట్టేందుకు అలవిగాని హామీలు ఇస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని.. వీటి కారణంగా ప్రజలు ప్రలోభాలకు గురవుతున్నారని పిల్‌లో పేర్కొన్నారు. ఇష్టారీతిన మేనిఫెస్టోలు, హామీలు ఇచ్చి.. అధికారం చేపట్టిన తరువాత వాటిని విస్మరిస్తున్నారని అన్నారు. ఈ కారణంగా రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు కూడా అవినీతికి కిందకే వస్తాయని.. వీటిపై తగిన ఆదేశాలు ఇవ్వాలని పిల్‌లో కోరారు. దీనిని పరిశీలించిన ధర్మాసనం.. పిల్‌ను తిరస్కరించింది.

For More National News and Telugu News..

Updated Date - May 27 , 2024 | 04:51 PM