Arvind Kejriwal: కేజ్రీవాల్ పిటిషన్‌పై 15న సుప్రీంకోర్టులో విచారణ
ABN , Publish Date - Apr 13 , 2024 | 03:17 PM
లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు, రిమాండ్‌ను సవాల్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై ఈనెల 15న సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఈడీ అరెస్టును సమర్ధిస్తూ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ సవాలు చేశారు.
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ (Liquor Policy)కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు, రిమాండ్‌ను సవాల్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) వేసిన పిటిషన్‌పై ఈనెల 15న సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరుగనుంది. ఈడీ అరెస్టును సమర్ధిస్తూ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ సవాలు చేశారు.
Kejriwal: ఇదేం పద్ధతి.. జైలులో కేజ్రీవాల్‌ను కలువనీయలేదు..?
మనీలాండిరింగ్ కేసులో గత నెలలో కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేయగా, ఏప్రిల్ 15వ తేదీ వరకూ ఆయనను ఢిల్లీ కోర్టు జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. కేజ్రీవాల్ అరెస్టు చట్టనిబంధనలకు లోబడే ఉందంటూ హైకోర్టు తీర్పు చెప్పింది. తగినన్ని సాక్ష్యాధారాలు ఈడీ వద్ద ఉన్నాయని తెలిపింది. అరెస్టు చేసిన సమయంపై దర్యాప్తు సంస్థను నిందించడం సరికాదని స్పష్టం చేసింది. లిక్కర్ పాలసీ రూపకల్పనలోనూ, ఇతర వ్యక్తులతో కుట్ర ఆరోపణల విషయంలోనూ కేజ్రీవాల్ ప్రమేయం ఉన్నట్టు కోర్టుకు అందజేసిన రికార్డులు స్పష్టంగా చెబుతున్నాయని జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఇచ్చిన 103 పేజీల జడ్జిమెంట్ స్పష్టం చేసింది. ఇదే కేసులో అరెస్టయిన ఆప్ నేత మనీష్ సిసోడియా గత ఏడాది ఫ్రిబవరి నుంచి జైలులో ఉన్నారు. మరో ఆప్ నేత సంజయ్ సింగ్ ఇటీవలే బెయిలుపై జైలు నుంచి విడుదలయ్యారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం