Tirumala: తిరుమలను కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్న పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
ABN , Publish Date - Nov 08 , 2024 | 10:48 AM
తిరుమలను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని సుప్రీంకోర్టులో కేఏ పాల్ వేసిన పిటిషన్‌ను నేడు విచారించనున్నారు. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టనుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
లక్షలాది మంది భక్తులు దర్శించుకునే ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిని(Tirumala) కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ నేడు విచారణకు రానుంది. ఈ అంశంపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ చేయనుంది. తిరుమల దేవాలయాల నిర్వహణ పాలకమండలి చేతిలో కాకుండా పూజారుల చేతుల్లో ఉంచాలని కేఏ పాల్ పిటిషన్‌లో కోరారు.
దీంతోపాటు దేవాలయాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని పాల్ అన్నారు. తిరుమల దేవాలయానికి వచ్చే వేల కోట్ల ఆదాయం దుర్వినియోగం అవుతుందని కేఏ పాల్ పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ, సీబీఐ, డీజీపీలను ప్రతివాదులుగా చేరుస్తూ కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ ప్రాంతం మాదిరిగా
కేవలం 744 మంది కేథలిక్కులున్న వాటికన్ సిటీని ప్రత్యేక ప్రాంతంగా గుర్తించారని ఈ సందర్భంగా కేఏ పాల్ ప్రస్తావించారు. ఇదే సమయంలో లక్షలాది మంది భక్తులకు ప్రాధాన్యత ఉన్న తిరుపతిని కూడా ఆ విధంగా చేయాలని పాల్ కోరారు. 100 రోజుల సంకీర్ణ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే తిరుమల లడ్డూ వివాదాన్ని ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెరపైకి తెచ్చారని విమర్శించారు. జులైలో లభించే లడ్డూల నాణ్యతపై ల్యాబ్ రిపోర్టును సెప్టెంబర్‌లోనే ఎందుకు తెప్పించారని, సమస్య ఏ సమయానికి వచ్చిందని ప్రశ్నించారు.
సీబీఐ విచారణ కూడా..
లడ్డూ వివాదానికి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు కేఏ పాల్ వెల్లడించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి నేతలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. లడ్డూలలో ఎలాంటి కల్తీ లేదని, భక్తుల్లో అనవసర గందరగోళం సృష్టిస్తున్నారని, లడ్డూల గురించి తదుపరి చర్చలు జరగకుండా ఆదేశాలు జారీ చేయాలని పాల్ తన పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించారు. అంతేకాదు తిరుమల లడ్డూల నాణ్యతపై తలెత్తిన వివాదంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) విచారణ అవసరమని కేఏ పాల్ గతంలో అన్నారు.
జనాల ఆసక్తి
కేఏ పాల్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో లడ్డూ వివాదం, తిరుపతికి కేంద్ర పాలిత హోదా కల్పించే రెండింటిపై సుప్రీంకోర్టు నిర్ణయం కోసం అనేక మంది ఎదురుచూస్తున్నారు. మరి కేఏ పాల్ పిటిషన్ విషయంలో ధర్మాసనం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.
ఇవి కూడా చదవండి:
Cigarettes Ban: ఈ రాష్ట్రంలో పొగాకు, సిగరెట్లు తాగడం నిషేధం.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..
CPCB: కాలుష్యంతో ప్రతి ఏటా 33 వేల మరణాలు.. ఈ అధ్యయనంపై కేంద్రం ప్రశ్నలు
Narendra Modi: నేటి నుంచి రంగంలోకి ప్రధాని మోదీ.. 7 రోజుల్లో 9 ఎన్నికల ర్యాలీలు..
Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..
Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
Read More National News and Latest Telugu News