Suresh Gopi: మోదీ 3.0 నుంచి తప్పుకోవాలనుకుంటున్నారా?.. సురేష్ గోపి స్పందనిదే..
ABN , Publish Date - Jun 10 , 2024 | 05:01 PM
కేరళ నుంచి ఎన్నికైన తొలి బీజేపీ ఎంపీ సురేష్ గోపికి నరేంద్ర మోదీ సారథ్యంలోని కొత్త మంత్రివర్గంలో సహాయ మంత్రిగా ఆదివారంనాడు చోటు దక్కింది. అయితే, కొత్త బాధ్యతల నుంచి తనను రిలీవ్ చేయాలని సురేష్ గోపి కోరుకుంటున్నట్టు మీడియోలో ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ ఊహాగానాలపై సురేష్ గోపి తోసిపుచ్చారు. మోదీ మంత్రివర్గానికి రాజీనామా చేస్తున్నట్టు మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.
న్యూఢిల్లీ: కేరళ నుంచి ఎన్నికైన తొలి బీజేపీ ఎంపీ సురేష్ గోపి (Suresh Gopi)కి నరేంద్ర మోదీ సారథ్యంలోని కొత్త మంత్రివర్గంలో సహాయ మంత్రిగా ఆదివారంనాడు చోటు దక్కింది. అయితే, కొత్త బాధ్యతల నుంచి తనను రిలీవ్ చేయాలని సురేష్ గోపి కోరుకుంటున్నట్టు మీడియోలో ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ ఊహాగానాలపై సురేష్ గోపి సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా తొలిసారి స్పందించారు. మోదీ మంత్రివర్గానికి రాజీనామా చేస్తున్నట్టు మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఇవి పూర్తిగా నిరాధారమైన వార్తలని వివరణ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేరళ అభివృద్ధి, శ్రేయస్సుకు తామంతా కట్టుబడి ఉన్నామని చెప్పారు.
Shehbaz Sharif congrats Modi: 'హ్యాట్రిక్' మోదీకి అభినందనలు తెలిపిన పాక్ ప్రధాని
మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడిగా పేరున్న సురేష్ గోపి ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి కేరళ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచారు. త్రిసూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 74,686 ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలుపొందారు. దీంతో ఆయనకు మోదీ తాజా మంత్రివర్గంలో సహాయమంత్రిగా చోటు దక్కింది. అయితే, తనకు మంత్రి పదవి కానీ, స్వతంత్ర హోదా ఉన్న సహాయమంత్రి పదవిని కానీ ఇస్తారని ఆశించిన సురేష్ గోపికి తాజా పరిణామం నిరాశ కలిగించిందంటూ వార్తలు వెలువడ్డాయి. అయితే, తనకు ఇచ్చిన హోదాపై సురేష్ గోపి అసంతృప్తితో ఉన్నారన్న వార్తలను కేరళ బీజేపీ అధ్యక్షుడు కె.సురేంద్రన్ సైతం తోసిపుచ్చారు. ఇదంతా మీడియా సృష్టేనని, అందులో ఎంతమాత్రం నిజం లేదని స్పష్టత ఇచ్చారు. ఇంతకుముందు కూడా సురేష్ గోపిని ఓడించాలని కేరళ బీజేపీ యూనిట్ ప్రయత్నిస్తోందంటూ మీడియా నిరాధార ప్రచారం చేసిందని, త్రిసూర్ నుంచి ఆయన పోటీ చేయడం లేదని కూడా వార్తలు ప్రచురించిందని అన్నారు.
Read More National News and Latest Telugu News