Delhi Liquor Scam: సీఎం కేజ్రీవాల్ కోర్టుకు హాజరుపై నెలకొన్న ఉత్కంఠ
ABN , Publish Date - Mar 16 , 2024 | 09:02 AM
న్యూఢిల్లీ: దాదాపు రెండేళ్లుగా సాగుతున్న ఢిల్లీ లిక్కర్ కేసులో పరిణామాలు మారుతున్నాయి. ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హాజరుపై ఉత్కంఠ నెలకొంది. శనివారం కోర్టు ముందు హాజరు కావాలని సీఎం కేజ్రీవాల్‌ను న్యాయస్థానం ఆదేశించింది.
న్యూఢిల్లీ: దాదాపు రెండేళ్లుగా సాగుతున్న ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Scam)లో పరిణామాలు మారుతున్నాయి. ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (CM Kejriwal) హాజరుపై ఉత్కంఠ నెలకొంది. శనివారం కోర్టు ముందు హాజరు కావాలని సీఎం కేజ్రీవాల్‌ను న్యాయస్థానం ఆదేశించింది. కాగా ఈడీ విచారణకు (ED investigation) కేజ్రీవాల్ హాజరు కావడం లేదంటూ అధికారులు కోర్టును ఆశ్రయించారు. అయితే న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలిస్తుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకు కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు ఏడుసార్లు నోటీసులు ఇచ్చారు.
కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేయడంతో ఈ కేసులో ఒక్కసారిగా వేగం పెరిగింది. ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఈ కేసులో అరెస్ట్ అయి దాదాపు జైలులోఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు ఇప్పటికే 7 సార్లు నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ ఆయన హాజరుకావడంలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం.. తమను వేధించేందుకే ఈ కేసులు పెట్టించిందని కేజ్రీవాల్ ఆరోపించారు. కాగా మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని సీఎం కేజ్రీవాల్ పెట్టుకున్న అభ్యర్థనను సెషన్స్ కోర్టు నిరాకరించింది.