Share News

BTS: బీటీఎస్ స్టార్లను కలిసేందుకు ఇంటినుంచి వెళ్లిన 13 ఏళ్ల బాలికలు..అంతలోనే ట్విస్ట్

ABN , Publish Date - Jan 08 , 2024 | 01:45 PM

బీటీఎస్‌ స్టార్లను కలిసేందుకు ముగ్గురు 13 ఏళ్ల అమ్మాయిలు ఏకంగా ఇంటి నుంచి పారిపోయి వచ్చారు. అయితే వారికి పాస్‌పోర్ట్ లేకున్నా కూడా వెళ్లాలని అనుకున్నారు. అయితే తర్వాత ఏమైంది వారు సౌత్ కొరియా వెళ్లారా లేదా అనే విషయాలను ఇక్కడ చుద్దాం.

BTS: బీటీఎస్ స్టార్లను కలిసేందుకు ఇంటినుంచి వెళ్లిన 13 ఏళ్ల బాలికలు..అంతలోనే ట్విస్ట్

దక్షిణ కొరియా BTS స్టార్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరికి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అభిమానులు ఉన్నారు. పాపులర్ యూట్యూబ్ ఛానెల్లో వీరు ఒక డ్యాన్స్ పాటను పోస్ట్ చేస్తే లక్షల లైక్స్, షేర్లు వస్తాయి. నేటి యువత వీరి సంగీతం, పాటలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే ఈ స్టార్లను కలిసేందుకు కొరియాలో బీడీఎస్ సంగీత కార్యక్రమాన్ని వీక్షించేందుకు తమిళనాడు కరూర్ జిల్లాకు చెందిన ముగ్గురు పాఠశాల విద్యార్థినులు కేవలం 14 వేల రూపాయలతో విశాఖపట్నం నుంచి సముద్ర మార్గంలో కొరియా వెళ్లాలని ప్లాన్ చేశారు. కానీ ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల రక్షించబడ్డారు. అయితే అసలేమందో ఇప్పుడు చుద్దాం.


ఆ ముగ్గురు బాలికలకు సంగీతం, డ్యాన్స్ పట్ల వారికున్న అభిరుచితో పాస్‌పోర్ట్ లేకున్నా కూడా 14000 రూపాయలతో మొదట చెన్నై(chennai)కి రైలులో వెళ్లారు. అయితే అది తమకు దక్షిణ కొరియా చేరుకోవడానికి సహాయపడుతుందని అమాయకంగా నమ్మారు. ఆ తర్వాత చెన్నైలో హోటల్‌ గది సంపాదించి పాస్‌పోర్టు లేకుండా చెన్నై నుంచి ఓడలో వెళ్లాలనుకున్నారు. వారు సియోల్‌కు ఓడను బుక్ చేసుకోవడానికి ఓ ప్రాంతానికి వెళ్లారు కానీ ఫలించలేదు.

ఆ క్రమంలో తిరిగి ఇంటికి వెళ్లాలని అనుకుని చెన్నై నుంచి రైలులో వెళ్లిన ముగ్గురు బాలికలు ఆహారం కొనుగోలు చేసేందుకు కాట్పాడి రైల్వే స్టేషన్‌లో దిగారు. ఆహారం కోసం దిగిన ముగ్గురు బాలికలు రైలు వెళ్లిందని కూడా తెలియకుండా స్టేషన్ చుట్టూ తిరిగారు. స్టేషన్ చుట్టూ చాలా సేపు తిరుగుతున్న అమ్మాయిల ఆగడాలను చూసిన ఆర్పీఎఫ్ పోలీసులు వారిని తమ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అధికారుల ప్రాథమిక విచారణలో జనవరి 4న ముగ్గురు బాలికలు తెలియకుండా ఇంటి నుంచి వెళ్లిపోయారని తెలిసింది. ఆ తర్వాత వారికి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సదుపాయంలో వసతి కల్పించి పోలీసులు(police) వారి తల్లిదండ్రులను పిలిపించి అప్పగించారు.

Updated Date - Jan 08 , 2024 | 01:46 PM