Share News

Telangana Exit Polls: తెలంగాణలో ఆ రెండు పార్టీల మధ్యనే పోరు?.. భారాస గెలిచేవి ఎన్ని సీట్లు?

ABN , Publish Date - Jun 01 , 2024 | 07:35 PM

దేశంలోని సార్వత్రిక ఎన్నికల సమరం ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. దేశంలోనూ, ఆయా రాష్ట్రాల్లోనూ గెలుపు అంచనాలను వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం తెలంగాణ లోక్‌సభ్ ఎన్నికల బరిలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది.

Telangana Exit Polls: తెలంగాణలో ఆ రెండు పార్టీల మధ్యనే పోరు?.. భారాస గెలిచేవి ఎన్ని సీట్లు?
KCR

దేశంలోని సార్వత్రిక ఎన్నికల సమరం ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. దేశంలోనూ, ఆయా రాష్ట్రాల్లోనూ గెలుపు అంచనాలను వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం తెలంగాణ లోక్‌సభ్ ఎన్నికల బరిలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు మే 13వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-బీజేపీ నువ్వా? నేనా? అన్నట్టు తలపడ్డాయని సర్వే సంస్థలు పేర్కొన్నాయి.


మొన్నటి వరకు అధికార పార్టీగా ఉన్న బీఆర్‌ఎస్ ఒక్క సీటుకు మించి గెలవలేదని చాలా సంస్థలు జోస్యం చెప్పాయి. మరికొన్ని సర్వే సంస్థలు ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఒక్క ఎంపీ స్థానం గెలుచుకోవడం కూడా కష్టమేనని అభిప్రాయపడ్డాయి. కాంగ్రెస్, బీజేపీ దాదాపు సమానంగా ఎంపీ సీట్లను గెలుచుకోవచ్చని పేర్కొన్నాయి. ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ సర్వే ప్రకారం.. తెలంగాణలో కాంగ్రెస్ 6-8 మధ్య, బీజేపీ 8-9 మధ్య, ఎంఐఎం 1, బీఆర్‌ఎస్-0 గెలుస్తాయి. ఆరా సర్వే సంస్థ ప్రకారం.. కాంగ్రెస్ 7-8 మధ్య, బీజేపీ 8-9 మధ్య, ఎంఐఎం 1, బీఆర్‌ఎస్-0 గెలుచుకుంటారు.


ఏబీపీ-సీ ఓటర్ సర్వే ప్రకారం.. కాంగ్రెస్ 7-9 మధ్య, బీజేపీ 9-12 మధ్య, ఎంఐఎం 1, బీఆర్‌ఎస్-0 గెలుచుకుంటారు. పీపుల్స్ పల్స్ ప్రకారం.. కాంగ్రెస్ 7-9 మధ్య, బీజేపీ 6-8 మధ్య, ఎంఐఎం 1, బీఆర్‌ఎస్-0-1 గెలుచుకుంటారు. జన్‌కీ బాత్ సర్వే ప్రకారం.. కాంగ్రెస్ 4-7 మధ్య, బీజేపీ 9-12 మధ్య, ఎంఐఎం 1, బీఆర్‌ఎస్-0-1 గెలుచుకుంటారు. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఒక్క స్థానానికి మించి గెలవలేదని అభిప్రాయపడ్డాయి.

ఇవి కూడా చదవండి..

Exit Polls 2024: మళ్లీ మోదీకే పట్టం.. ఎన్డీయేకే విజయావకాశాలు ఎక్కువంటున్న ఎగ్జిట్ పోల్స్!


Exit Polls 2024: రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు.. ఆ కూటమిదే ఘనవిజయం!


మరిన్ని ఎన్నికల వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 01 , 2024 | 07:38 PM