Share News

Delhi's Roose Avenue court :కవిత కస్టడీ పొడిగింపు

ABN , Publish Date - Jun 04 , 2024 | 05:20 AM

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్‌ కస్టడీని న్యాయస్థానం మరోసారి పొడిగించింది. సోమవారం ఆమెను ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. తొలుత ఈడీ కేసులో విచారణ జరిగింది.

Delhi's Roose Avenue court :కవిత కస్టడీ  పొడిగింపు

  • సీబీఐ కేసులో ఈ నెల 7 వరకు

  • ఈడీ కేసులో జూలై 3 దాకా..

న్యూఢిల్లీ, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్‌ కస్టడీని న్యాయస్థానం మరోసారి పొడిగించింది. సోమవారం ఆమెను ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.

తొలుత ఈడీ కేసులో విచారణ జరిగింది. జూలై 3న కవితను కోర్టు ముందు హాజరు పరచాలని న్యాయమూర్తి కావేరి బవేజా స్పష్టం చేశారు. సీబీఐ కేసులో మాత్రం మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపడతామని తెలిపారు.

కాగా, కవితను కలిసేందుకు భర్త అనిల్‌తోపాటు ఇద్దరు కుమారులకు అవకాశం కల్పించాలని ఆమె న్యాయవాది నితేష్‌ రాణా కోరారు. ఇద్దరు కుమారులు మైనర్లేనా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు.

పెద్దబ్బాయి మేజర్‌ అని, చిన్న కుమారుడు మైనర్‌ అని న్యాయవాది బదులివ్వగా, కవితను కలిసేందుకు జడ్జి అంగీకరించారు. ఆ తర్వాత కవితతో భర్త, కుమారులు కొద్దిసేపు ముచ్చటించారు. సీబీఐ కేసులో మధ్యాహ్నం 2 గంటల తర్వాత కోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 7 వరకు జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగిస్తున్నట్లు జడ్జి చెప్పారు. కోర్టు హాలులోకి వచ్చే ముందు కవిత ‘జై భారత్‌.. జై తెలంగాణ’ అంటూ నినాదాలు ఇచ్చారు.

Updated Date - Jun 04 , 2024 | 05:20 AM