Parliament: పార్లమెంట్‌లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీల సమావేశం ప్రారంభం
ABN , Publish Date - Jul 02 , 2024 | 10:55 AM
పార్లమెంట్‌లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీల సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ తదితరులు హాజరయ్యారు. సమావేశానికి ఎన్డీఎ భాగస్వామ్య పక్ష పార్టీల ఎంపీలు హాజరయ్యారు. ఎన్డీఎ భాగస్వామ్య పక్షాల ఎంపీలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు
ఢిల్లీ: పార్లమెంట్‌లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీల సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ తదితరులు హాజరయ్యారు. సమావేశానికి ఎన్డీఎ భాగస్వామ్య పక్ష పార్టీల ఎంపీలు హాజరయ్యారు. ఎన్డీఎ భాగస్వామ్య పక్షాల ఎంపీలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. సోమవారం లోక్ సభలో రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై చేసిన వాఖ్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే అంశంపై చర్చించనున్నారు. నేడు లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వనున్నారు.
నిన్న రాహుల్ గాంధీ లోక్‌సభలో బీజేపీని ఏకి పారేశారు. అసలు బీజేపీ వాళ్లు హిందువులే కాదని... భయాన్ని, విద్వేషాన్ని, అబద్ధాలను వ్యాపింపజేయడం హిందూ ధర్మం కాదని చెప్పారు. హిందువులమని చెప్పుకుంటూ హింస, విద్వేషాలను రెచ్చగొడుతున్నారన్నారు. ప్రధాని మోదీ సహా బీజేపీ, ఆర్ఎస్‌ఎస్ ఎవరూ హిందువులు కాదన్నారు. సుదీర్ఘంగా 40 నిమిషాల పాటు రాహుల్ ప్రసంగించారు. రాహుల్ వ్యాఖ్యలపై పెను దుమారమే చెలరేగింది. అధికారపక్షం మొత్తం లేచి నిలబడింది. ఏకంగా ప్రధాని మోదీయే రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. ఐదుగురు మంత్రులు అడ్డుకున్నా రాహుల్ ప్రసంగ ధాటిని అడ్డుకోలేకపోయారు.