Supreme Court: పిల్లలతో పోర్న్ వీడియోలు చేయడం తీవ్ర నేరమే.. సుప్రీంకోర్టు
ABN , Publish Date - Apr 20 , 2024 | 01:08 PM
పిల్లలు పోర్న్ చూడటం నేరం కాకపోవచ్చు. కానీ పిల్లలతోను అశ్లీల చిత్రాలు తీయడం మాత్రం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయం అని సుప్రీంకోర్టు వెల్లడించింది. అంతే కాకుండా దీనిని తీవ్ర నేరంగా పరిగణిస్తామని తెలిపింది.
పిల్లలు పోర్న్ చూడటం నేరం కాకపోవచ్చు. కానీ పిల్లలతోను అశ్లీల చిత్రాలు తీయడం మాత్రం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయం అని సుప్రీంకోర్టు ( Supreme Court ) వెల్లడించింది. అంతే కాకుండా దీనిని తీవ్ర నేరంగా పరిగణిస్తామని తెలిపింది. మద్రాస్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఫరీదాబాద్‌కు చెందిన జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్, న్యూదిల్లీకి చెందిన బచ్‌పన్ బచావో ఆందోళన్ అనే స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేచస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.
Amit Shah: సొంత కారు లేదు.. రూ.15 లక్షల అప్పు ఉంది.. అమిత్ షా ఆస్తుల విలువ ఇవే..
పిల్లలతో తీసిన అశ్లీల కంటెంట్‌ను మొబైల్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేశాడని అభియోగాలు మోపిన 28 ఏళ్ల వ్యక్తిపై కేసును మద్రాస్ హైకోర్టు జనవరి 11న రద్దు చేసింది. దీంతో స్వచ్చంద సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రెండు సంస్థల తరపున సీనియర్ న్యాయవాది హెచ్‌ఎస్ ఫూల్కా వాదనలు వినిపించారు. హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ పోక్సో చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని నిబంధనలను ప్రస్తావించారు. హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన నిందితుడి తరఫు న్యాయవాది మాట్లాడుతూ ఆ వీడియోలు వాట్సాప్‌లో ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయ్యాయని చెప్పారు.
Ayodhya: రామ్ లల్లా భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ సౌకర్యాన్ని పునరుద్ధరించిన ఆలయ ట్రస్ట్..
ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం వాదనలు ముగిశాయని పేర్కొంది. నేటితరం పిల్లలు పోర్న్ చూడటం అనే తీవ్రమైన సమస్యతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. సమాజం వారిని శిక్షించే బదులు విద్యాబుద్ధులు నేర్పేంత పరిణతి సాధించాలని కోరింది. తీర్పును రిజర్వు చేసింది.
మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి.