Share News

వెయిటర్‌ ఉద్యోగానికి వేల సంఖ్యలో బారులు!

ABN , Publish Date - Oct 07 , 2024 | 03:54 AM

కెనడాలో ఉన్నత చదువులు చదవడానికి వెళ్లిన భారత విద్యార్థులు ఓ రెస్టారెంట్‌ ముందు వేల సంఖ్యలో బారులు తీరారు! ఆ రెస్టారెంట్‌లో ఫుడ్‌ అంత బాగుంటుందా? అనుకుంటున్నారా? అయితే పప్పులో కాలేసినట్లే.

వెయిటర్‌ ఉద్యోగానికి వేల సంఖ్యలో బారులు!

  • కెనడాలో రెస్టారెంట్‌ ముందు భారత విద్యార్థుల భారీ క్యూ

న్యూఢిల్లీ, అక్టోబరు 6: కెనడాలో ఉన్నత చదువులు చదవడానికి వెళ్లిన భారత విద్యార్థులు ఓ రెస్టారెంట్‌ ముందు వేల సంఖ్యలో బారులు తీరారు! ఆ రెస్టారెంట్‌లో ఫుడ్‌ అంత బాగుంటుందా? అనుకుంటున్నారా? అయితే పప్పులో కాలేసినట్లే. వారంతా పొట్ట నింపుకోవడానికి కాదు.. పొట్టకూటి కోసం వెళ్లారు!! భారీ సంఖ్యలో బారులు తీరింది ఉద్యోగం కోసం..!

అది కూడా వెయిటర్‌, సర్వీస్‌ స్టాఫ్‌ పోస్టుల కోసం..! కెనడాలోని ‘తందూరి ఫ్లేమ్‌’ అనే రెస్టారెంట్‌ ముందు కనిపించిందీ దృశ్యం. వేల సంఖ్యలో భారతీయ విద్యార్థులు చిన్న కొలువుల కోసం క్యూలో నిలబడి పడిగాపులు పడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘ఇక్కడ ఒక్కరికి కూడా సరైన కొలువు దొరకడం లేదు. చాలా బాధగా ఉంది’’ అని క్యూలో ఉన్న ఓ విద్యార్థి చెప్పాడు. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లే విద్యార్థులు ఒక్కసారి ఆలోచించుకోవాలని పలువురు అభిప్రాయపడ్డారు.

Updated Date - Oct 07 , 2024 | 03:54 AM