India's Cleanest Air City: దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన గాలి వీచే నగరాలివే..
ABN , Publish Date - Nov 04 , 2024 | 10:58 AM
Top Indian Cleanest Air City: దీపావళి పండుగ తరువాత దేశ వ్యాప్తంగా వాయు కాలుష్యం భారీగా పెరిగింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 400 దాటింది. ఇది చాలా ప్రమాదకర స్థాయి. ఒక్క ఢిల్లీలోనే కాదు.. చాలా నగరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
Top Indian Cleanest Air City: దీపావళి పండుగ తరువాత దేశ వ్యాప్తంగా వాయు కాలుష్యం భారీగా పెరిగింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 400 దాటింది. ఇది చాలా ప్రమాదకర స్థాయి. ఒక్క ఢిల్లీలోనే కాదు.. చాలా నగరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కాలుష్యపూరితమైన గాలిలో ప్రజలు జీవించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన గాలి ఉన్న నగరం/నగరాలు ఏంటో తెలుసా? ఉత్తమ గాలి నాణ్యత ఉన్న నగరం ఏది? దేశంలో స్వచ్ఛమైన గాలి ఉన్న టాప్ 10 నగరాలు/ప్రాంతాల పేర్లు ఇప్పుడు తెలుసుకుందాం..
చన్నరాయపట్నం..
కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఉన్న చన్నరాయపట్నం నగరంలో అత్యంత స్వచ్ఛమైన గాలి ఉంది. అందుకే ఈ ప్రాంతం టాప్ 1 లో నిలిచింది. చన్నరాయపట్నంలోని AQI సోమవారం ఉదయం 8 గంటలకు 8 పాయింట్స్‌గా నమోదైంది.
బిష్ణుపూర్..
పరిశుభ్రమైన గాలి ఉన్న నగరాల జాబితాలో పశ్చిమ బెంగాల్‌లోని బిష్ణుపూర్ రెండో స్థానంలో ఉంది. సోమవారం ఉదయం 8 గంటలకు బిష్ణుపూర్ ఏక్యూఐ 10 పాయింట్స్ నమోదైంది.
ఈ 3 నగరాల్లో AQI 11..
అస్సాంకు చెందిన సిల్చార్, మణిపూర్‌కు చెందిన కక్చింగ్, కర్ణాటకలోని బేలూర్ నగరం మూడవ స్థానంలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో సోమవారం ఉదయం 8 గంటలకు 11 పాయింట్స్ నమోదైంది.
కోహిమా..
నాగాలాండ్ రాజధాని కోహిమా పరిశుభ్రమైన గాలిలో ఆరవ స్థానంలో ఉంది. ఇక్కడ సోమవారం ఉదయం 8 గంటలకు AQI 12 గా నమోదైంది.
హసన్, ఇంఫాల్..
దేశంలోని స్వచ్ఛమైన గాలిలో కర్ణాటకలోని హసన్ నగరం, మణిపూర్ రాజధాని ఇంఫాల్ కూడా టాప్ 10లో ఉన్నాయి. ఈ రెండు నగరాల్లో సోమవారం ఉదయం 8 గంటలకు ఏక్యూఐ 13 నమోదైంది.
ఐజ్వాల్..
మిజోరం రాజధాని ఐజ్వాల్‌లో కూడా గాలి చాలా శుభ్రంగా ఉంది. గాలి నాణ్యత ఆధారంగా ఐజ్వాల్ తొమ్మిదవ స్థానంలో ఉంది. సోమవారం ఉదయం 8 గంటలకు ఐజ్వాల్‌లో ఏక్యూఐ 14 నమోదైంది.
మదనపల్లి..
పరిశుభ్రమైన గాలి ఉన్న మొదటి 10 నగరాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లి 10వ స్థానంలో ఉంది. ఇక్కడ సోమవారం ఉదయం 8 గంటలకు ఏక్యూఐ 15 పాయింట్స్ నమోదైంది.
Also Read:
కరెంట్ షాక్ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా
హ్యాంగోవర్ కు చెక్ పెట్టే చిట్కాలివే..
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
For More National News and Telugu News..