AAP: ఆప్ మహార్యాలీకి 'ఇండియా' కూటమి దిగ్గజాలు
ABN , Publish Date - Mar 30 , 2024 | 09:30 PM
అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ లకు సంఘీభావంగా ఆదివారంనాడు న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరుగనున్న ఆప్ 'మహార్యాలీ' లో 'ఇండియా' కూటమికి చెందిన ప్రముఖ నేతలు పాల్గోనున్నారు.
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), హేమంత్ సోరెన్ (Hemant Soren)లకు సంఘీభావంగా ఆదివారంనాడు న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరుగనున్న ఆప్ 'మహార్యాలీ' (Loktantra Bachao Rally)లో 'ఇండియా' (I.N.D.I.A.) కూటమికి చెందిన ప్రముఖ నేతలు పాల్గోనున్నారు. ర్యాలీ నిర్వహణకు అధికారులు అనుమతి ఇచ్చారని, 20,000 మందికి పైగా ప్రజలు ఈ మహార్యాలీలో పాల్గొంటారని ఆప్ సీనియర్ నేత గోపాయల్ రాయ్ (Gopal Rai) తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ ఇటీవల అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ మహార్యాలీని ఆప్ నిర్వహిస్తోంది.
'క్యూ' కట్టనున్న కూటమి నేతలు..
'ఇండియా' కూటమికి చెందిన 27 నంచి 28 పార్టీల ప్రముఖులంతా ఈ మహార్యాలీలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, సీతారాం ఏచూరి, డి.రాజా, డెరిక్ ఒబ్రెయిన్, తిరుచ్చి శివ, ఫరూఖ్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, జార్ఖాండ్ సీఎం చంపాయి సోరెన్, హేమంత్ సోరెన్ భార్య కల్పానా సోరెన్ తదితరులు హజరుకానున్నారు.