Share News

Tungabhadra: ఉప్పొంగిన ‘తుంగ’.. కంప్లి, గంగావతిల మధ్య రాకపోకల బంద్‌

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:38 PM

తుంగభద్ర జలాశయం(Tungabhadra Reservoir) నుంచి అత్యధిక స్థాయిలో నీరు నదికి విడుదల చేయడంతో కంప్లి, గంగావతి మధ్య రాకపోకలను అధికారులు ఆపివేశారు. జలాశయం నుంచి 30 గేట్ల ద్వారా నదికి 1,07,096 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో నీరు వంతెనను తాకుతూ ప్రవహిస్తోంది.

Tungabhadra: ఉప్పొంగిన ‘తుంగ’.. కంప్లి, గంగావతిల మధ్య రాకపోకల బంద్‌

- 30 గేట్ల ద్వారా నదికి 1,07,096 క్యూసెక్కుల నీటి విడుదల

- గంజికేంద్రాల ఏర్పాటు

కంప్లి(బెంగళూరు): తుంగభద్ర జలాశయం(Tungabhadra Reservoir) నుంచి అత్యధిక స్థాయిలో నీరు నదికి విడుదల చేయడంతో కంప్లి, గంగావతి మధ్య రాకపోకలను అధికారులు ఆపివేశారు. జలాశయం నుంచి 30 గేట్ల ద్వారా నదికి 1,07,096 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో నీరు వంతెనను తాకుతూ ప్రవహిస్తోంది. హంపి ప్రాంతంలోని కోదండరామాలయం, చక్రతీర్థం పూర్తిగా మునిగిపోయే విధంగా తుంగ పరవళ్లు తొక్కుతోంది. అలాగే కంప్లి కోట వద్ద చుట్టుపక్కల చెరుకు, అరటి తోటలు నీటిలో మునిగాయి. సన్నాపురం, బెళుగోడుహాళ్‌(Sannapuram, Belugoduhal) వద్ద నదికి వేసుకున్న మోటార్లను విప్పి రైతులు ఒడ్డుకు చేర్చుతున్నారు.

ఇదికూడా చదవండి: చిలుకూరులో 30 వరకు 144 సెక్షన్‌..


అత్యధికంగా నీరు రావడంతో పరిస్థితిని జిల్లా అధికారులు ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, జిల్లా ఎస్పీ శోభారాణి, జెడ్పీసీఈవో రాహుల్‌ శరణప్ప సుంకనూరులు సమీక్షించారు. అంతకుముందు ఉదయం అధికారులు జలాలాయప్ప, లేబర్‌ ఆఫీసర్‌ మౌనేష్‌, కంప్లి కోట, సన్నాపురం, ఇటిగి(Kampli Kota, Sannapuram, Itigi) గ్రామాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు మాట్లాడుతూ ప్రతి యేటా జలాశయం నుంచి ఎక్కువగా నీరు రావడం వల్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోందన్నారు. ఈ ఏడు ఇప్పటికే కొప్పళ జిల్లా గంగావతి నుంచి కంప్లి వైపు రాకపోకలు కూడా బంద్‌ చేశామన్నారు. కంప్లి కోటలోని 50 కుటుంబాల మత్స్యకారులకు గంజి కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వారు నది ఉధృతం తగ్గే వరకు గంజి కేంద్రాల్లో వుంటూ జీవనం కొనసాగించాలన్నారు.


pandi1.jpg

వీటితో పాటు బెళుగోడుహాళ్‌, సన్నాపురం, ఇటిగి గ్రామాల్లో కూడా గంజి కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. దీనికి తోడుగా ఆరోగ్య శాఖ, ఆంబులెన్స్‌లు సిద్దంగా వుంచామన్నారు. మత్స్యకారులు నది ఒడ్డుకు వెళ్లకుండా ముందస్తు హెచ్చరికలు చేశామన్నారు. ఇంకా ఎక్కువగా జలాశయంలోకి నీరు వచ్చినట్లయితే వంతెన పైకి కూడా నీరు వచ్చే అవకాశం వుందన్నారు.

పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ, తదితర శాఖల సిబ్బంది అప్రమత్తంగా వుంటూ ఎలాంటి సంఘటనలు జరుగకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ శివరాజ్‌కుమార్‌, ముఖ్య అధికారి దుర్గన్న, ఈవో శ్రీకుమార్‌, డాక్టర్‌ అరుణ్‌ కుమార్‌, ఏడీ మల్లన్నగౌడ, బసవరాజు, జగదీష్‌, తదితరులు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: సాగర్‌ నీటి విడుదలకు మా సమ్మతి అక్కర్లేదా?

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 27 , 2024 | 12:38 PM