Share News

Drug Seizure: సినిమా స్టైల్లో రూ. 17 కోట్ల డ్రగ్స్ తరలింపు.. చివరకు ఏమైందంటే..

ABN , Publish Date - Dec 28 , 2024 | 09:43 AM

కస్టమ్స్ అధికారులు తాజాగా భారీ డ్రగ్స్ దందాను కట్టడి చేశారు. ఈసారి ఏకంగా 17 కోట్ల విలువైనకొకైన్‌ను అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, దీనిపై విచారణ కొనసాగుతోంది.

Drug Seizure: సినిమా స్టైల్లో రూ. 17 కోట్ల డ్రగ్స్ తరలింపు.. చివరకు ఏమైందంటే..
Drug Seizure

ఇద్దరు వ్యక్తులు గుట్టుగా డ్రగ్స్ తీసుకెళ్లేందుకు ఏకంగా వీడొక్కడే సినిమా లెవల్లో ప్లాన్ చేశారు. ఈ సినిమాలో డ్రగ్స్ తీసుకెళ్లేందుకు క్యాప్సెల్స్ రూపంలో వాటిని రూపొందించుకుని నోటి ద్వారా మింగి అక్రమంగా రవాణా చేసే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కూడా అచ్చం అలాగే ప్లాన్ చేసి దొరికిపోయారు. ఈ ఘటన ఢిల్లీ (delhi) ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI)లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. కస్టమ్స్ అధికారులు శుక్రవారం 17 కోట్ల రూపాయల విలువైన కొకైన్‌‌తో నిండి ఉన్న 156 క్యాప్సూల్స్‌ను స్వాధీనం (Drug Seizure) చేసుకున్నట్లు ప్రకటించారు.


కొనసాగుతున్న విచారణ

ఈ కేసులో బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారు ఫిలిప్పీన్స్ పౌరులుగా గుర్తించబడ్డారు. ఆ ఇద్దరు ప్రయాణికులు కొకైన్‌తో నిండి ఉన్న 156 క్యాప్సూల్స్‌ను తమ కడుపులో మింగినట్లు అంగీకరించారు. ఆ క్యాప్సూల్స్‌ని వారు ఇండియాలో సేల్ చేసేందుకు సిద్ధమైనట్లు అధికారులు గుర్తించారు. కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ తెలిపిన ప్రకారం వారిలో ఒకరు మహిళ, మరొకరు పురుషుడు ఉన్నారు. మరింత సమాచారం కోసం అధికారిక విచారణ కొనసాగుతోంది.


భారీ సక్సెస్

ఇది అంతర్జాతీయ డ్రగ్స్ తరలింపు వ్యవస్థపై మరో పెద్ద విజయమని చెప్పవచ్చు. IGI విమానాశ్రయంలో గడచిన కొంతకాలంగా ఈ రకమైన భారీ పట్టివేత జరగలేదు. ఈ నేపథ్యంలో కస్టమ్స్ అధికారులు అన్ని విమానాల నుంచి వచ్చే ప్రయాణికులపై మరింత జాగ్రత్తగా, సురక్షితంగా తనిఖీలు చేపట్టినట్లుగా వెల్లడించారు. ఈ ఘటనను పరిగణనలోకి తీసుకున్న అధికారులు నిబంధనల ఉల్లంఘన లేదా అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాతో పోరాడటానికి భారతదేశం చురుకుగా చర్యలు తీసుకుంటోంది. ఇది తెలిసిన నెటిజన్లు కస్టమ్స్ అధికారులు దేశంలోని భద్రతా వ్యవస్థలలో కీలక పాత్ర పోషిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Traffic Guidelines: రాజధాని ప్రజలకు అలర్ట్.. మధ్యాహ్నం 3 వరకు ట్రాఫిక్ ఆంక్షలు


School Holidays: 15 రోజులు స్కూళ్లకు సెలవు.. కారణమిదే..


Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..

Manmohan Singh Net Worth: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసా..

Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..

Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..


Read More National News and Latest Telugu News

Updated Date - Dec 28 , 2024 | 09:48 AM