Delhi: కుంటలో దిగిన చిన్నారులు..
ABN , Publish Date - Aug 10 , 2024 | 08:57 AM
వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీలో ఎటు చూసినా వరదనీరే కనిపిస్తోంది. లోతట్టు ప్రాంతాల పరిస్థితి మరి దారుణంగా ఉంది. వరదనీటితో కొన్ని చోట్ల కుంటలు ఏర్పడ్డాయి. ప్రేమ్ నగర్ ఏరియాలో గల రాణి ఖేరా గ్రామంలో కుటం ఏర్పడింది. శుక్రవారం సాయంత్రం నలుగురు చిన్నారుల ఆ కుంట వద్దకెళ్లారు. సరదా కోసం అందులోకి ఇద్దరు చిన్నారులు దిగారు. కుంట లోతులోకి దిగి నీట మునిగారు. మరో ఇద్దరు స్థానికులకు తెలుపగా, వారు పోలీసులకు సమాచారం అందజేశారు.
ఢిల్లీ: వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) ఎటు చూసినా వరదనీరే కనిపిస్తోంది. లోతట్టు ప్రాంతాల పరిస్థితి మరి దారుణంగా ఉంది. వరదనీటితో కొన్ని చోట్ల కుంటలు ఏర్పడ్డాయి. ప్రేమ్ నగర్ ఏరియాలో గల రాణి ఖేరా గ్రామంలో కుటం ఏర్పడింది. శుక్రవారం సాయంత్రం నలుగురు చిన్నారుల ఆ కుంట వద్దకెళ్లారు. సరదా కోసం అందులోకి ఇద్దరు చిన్నారులు దిగారు. కుంట లోతులోకి దిగి నీట మునిగారు. మరో ఇద్దరు స్థానికులకు తెలుపగా, వారు పోలీసులకు సమాచారం అందజేశారు.
ఇద్దరు మృతి..
స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కుంట నీటిలో పడిన ఇద్దరు చిన్నారులను వెలికితీశారు. అప్పటికే వారిద్దరూ చనిపోయారని వివరిచారు. ఇద్దరి వయస్సు 9, 15 ఏళ్లు ఉంటుందని పోలీసులు వివరించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం సంజయ్ గాంధీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. వర్షం పడిన తర్వాత కుంట వద్దకు సరదా కోసం వెళ్లగా.. విషాదం నింపింది. అప్పటివరకు తమతో ఉన్న స్నేహితులు అంతలోనే కుంటలో మునిగిపోయారని మరో ఇద్దరు వాపోతున్నారు. ఆ షాక్ నుంచి తేరుకోలేక పోతున్నామని విలపించారు.
విషాదం..
ఢిల్లీలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. రావూస్ కోచింగ్ సెంటర్ బేస్ మెంట్‌లోకి వరదనీరు పోటెత్తింది. బేస్ మెంట్‌లో ఉన్న లైబ్రరీలో చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. దాంతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. మిగతా కోచింగ్ సెంటర్లను ఢిల్లీ మున్సిపల్ అధికారులు పరిశీలించారు. నిబంధనలను పాటించని కోచింగ్ సెంటర్లను సీజ్ చేశారు. వర్షాలతో వచ్చిన వరదలతో ఢిల్లీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. శివారు ప్రాంతాల్లో ఏర్పడిన కుంటల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇదే విషయం జనాలకు మున్సిపల్ అధికారులు, సిబ్బంది సూచించారు. కొందరు విద్యార్థులు కుంట వద్దకు వెళ్లడంతో విషాదం నెలకొంది. వారి తల్లిదండ్రులకు తీరని విషాదం నింపారు.
Read More National News and Latest Telugu News