Share News

Uddhav Thackeray: ఐదుగురు రెబల్స్‌పై ఉద్ధవ్ థాకరే వేటు

ABN , Publish Date - Nov 05 , 2024 | 05:29 PM

మహారాష్ట్రలో రెబల్స్ బెడద వల్ల ఓట్లు చీలి పార్టీల గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో మమహాయుతి, మహా వికాస్ అఘాడి కూటములు తెరవెనుక నామినేషన్ల ఉపసంహరణకు ప్రయత్నాలు సాగించాయి. కొందరు అసంతృప్తి నేతలు ఆయా పార్టీలకు రాజీనామా చేశారు.

Uddhav Thackeray: ఐదుగురు రెబల్స్‌పై ఉద్ధవ్ థాకరే వేటు

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో (Maharashtra Assembly Elections) తిరుగుబాటు అభ్యర్థుల బెడద ఈసారి ఎక్కువగా ఉంది. దీంతో బుజ్జగింపు, క్రమశిక్షణా చర్యల్లో ప్రధాన కూటమి పార్టీలు తలమునకలవుతున్నాయి. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు నిరాకరించిన ఐదుగురు తిరుగుబాటు అభ్యర్థులపై ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) సారథ్యంలోని శివసేన మంగళవారంనాడు పార్టీ బహిష్కరణ వేటు వేసింది. పార్టీ టిక్కెట్లు ఇవ్వడానికి నిరాకరించడంతో ఈ ఐదుగురు నేతలు స్వతంత్ర అభ్యర్థుల ఎన్నికల బరిలోకి దిగారు.

Sharad Pawar: ఎన్నికల్లో పోటీపై శరద్ పవార్ సంచలన ప్రకటన


వీరిపైనే వేటు

శివసేన (యూబీటీ) బహిష్కరణ వేటు పడిన నేతల్లో యవత్మాల్‌లోని వని జిల్లా హెడ్ విశ్వాస్ నాందేకర్. ఝరికి చెందిన చంద్రకాంత్ ఘుగుల్, మెరెగావ్ నేత సంజయ్ అవారి, బివాండీ ఈస్ట్ ఎమ్మెల్యే రూపేష్ మహత్రే, వనికి చెందిన ప్రసాద్ థాకరే ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందునే ఈ ఐదుగురు నేతలను పార్టీ నుంచి బహిష్కరించినట్టు శివసేన (యూబీటీ) ఒక ప్రకటనలో తెలిపింది. మహత్రే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయనకు ఈసారి పార్టీ టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన ఇండిపెండెంట్‌గా పోటీలోకి దిగారు. పడ్నేకర్ సైతం వెర్సోవా నుంచి నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదు. పలువురు ఇతర నేతలు కూడా ఇంటిపెండెంట్లుగా నామినేషన్లు వేసినప్పటకీ వారిని పార్టీ ఒప్పించి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేసింది.


ఏక్‌నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్‌సీపీ, బీజేపీతో కూడిన మహాయుతి కూటమి, కాంగ్రెస్, శరద్‌పవార్ ఎన్‌‌సీపీ , ఉద్ధవ్ థాకరే వర్గం శివసేనతో కూడిన మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమి మధ్యే ఈసారి ప్రధానంగా ఎన్నికల పోటీ నెలకొంది. అయితే రెబల్స్ బెడద వల్ల ఓట్లు చీలి పార్టీల గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో రెండు కూటమిలు తెరవెనుక నామినేషన్ల ఉపసంహరణకు ప్రయత్నాలు సాగించాయి. కొందరు అసంతృప్తి నేతలు ఆయా పార్టీలకు రాజీనామా చేశారు. ఎంవీఏ నుంచి 14 మంది నేతలు పార్టీ ఆదేశాలకు భిన్నంగా నామినేషన్లు వేయగా, ఆ తర్వాత కొందరు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఈనెల 21న ఒకేవిడతలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, 23న ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

CM Stalin: మా పాలన గొప్పతనం తెలుసుకోండి

Supreme Court of India: మదర్సాలపై కీలక తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు..

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 05 , 2024 | 05:30 PM