Uddhav Thackeray: ఆసుపత్రిలో చేరిన మాజీ సీఎం
ABN , Publish Date - Oct 14 , 2024 | 03:58 PM
గతంలోనూ గుండె సంబంధిత సమస్యలు తలెత్తడంతో 2012లో ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించారు. అయితే ఆ తర్వాత నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితికిపై ఎలాంటి సమాచారం లేదు.
ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) సోమవారంనాడు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ముంబైలోని రిలయెన్స్ ఆసుపత్రిలో చేర్చారు. ఆయనకు యాంజియోప్లాస్టీ (Angioplasty) నిర్వహించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వైద్యులు ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. గతంలోనూ గుండె సంబంధిత సమస్యలు తలెత్తడంతో 2012లో ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించారు. అయితే ఆ తర్వాత నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితికిపై ఎలాంటి సమాచారం లేదు.
Z category Security: కేంద్ర మంత్రికి 'జడ్' కేటగిరి భద్రత
కాగా, ఉద్ధవ్ థాకరే రొటీన్ ఆరోగ్య పరీక్షల కోసం సోమవారం ఉదయం 8 గంటలకు ఆసుపత్రిలో చేరారని, సాయంత్రానికి కల్లా ఆయన డిశ్చార్జి అయ్యే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, థాకరే మరో రోజు ఆసుపత్రిలో ఉండవచ్చని, మంగళవారం ఉదయం లేదా సాయంత్రం డిశ్చార్జి కావచ్చని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి.
పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు: ఆదిత్య
కాగా, ముందస్తుగా అనుకున్నట్టుగానే ఆరోగ్య పరీక్షల కోసం ఉద్ధవ్ థాకరే ఆసుపత్రిలో సోమవారం ఉదయం చేరారని, అందరి ఆశీస్సులతో అంతా సవ్యంగానే ఉందని, ప్రజాసేవ చేసేందుకు పూర్తి సన్నద్ధతో ఆయన ఉన్నారని థాకరే కుమారుడు, శివసేన (యూబీటీ) నేత ఆదిత్య థాకరే ఒక ట్వీట్‌లో తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..
ఇది కూడా చదవండి..