Share News

Sanjay Raut: సీఎం ఎవరైనా ప్రజల గుండెల్లో ఉద్ధవ్ నిలిచిపోతారు..

ABN , Publish Date - Aug 17 , 2024 | 09:10 PM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందే 'మహా వికాస్ అఘాడి' భాగస్వాములు తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని శివసేన-యూబీటీ చీఫ్ ఉద్ధవ్ థాకరే చేసిన విజ్ఞప్తిని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ శనివారంనాడు సమర్ధించారు. దీని వెనుక ఒత్తిడి రాజకీయాలు ఉన్నాయనే వాదనలను ఆయన తోసిపుచ్చారు.

Sanjay Raut: సీఎం ఎవరైనా ప్రజల గుండెల్లో ఉద్ధవ్ నిలిచిపోతారు..

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందే 'మహా వికాస్ అఘాడి' (MVA) భాగస్వాములు తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని శివసేన-యూబీటీ (Shiv Sena-UBT) చీఫ్ ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) చేసిన విజ్ఞప్తిని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) శనివారంనాడు సమర్ధించారు. దీని వెనుక ఒత్తిడి రాజకీయాలు ఉన్నాయనే వాదనలను ఆయన తోసిపుచ్చారు.


''సీఎం పదవికి అర్హత కలిగిన ఎవరికైనా మద్దతిస్తానని ప్రకటించడం ద్వారా ఉద్ధవ్ తన పెద్ద మనసును చాటుకున్నారు. ఇదెంతమాత్రం ఒత్తిడి రాజకీయాలు కాదు. మహారాష్ట్ర ప్రయోజనాల కోసం ఉద్దేశించినది'' అని సంజయ్ రౌత్ అన్నారు. ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల షేరింగ్ ఫార్ములా విషయంలో ఎంవీఏ భాగస్వాముల మధ్య ఎలాంటి విభేదాలు లేవని కూడా ఆయన స్పష్టం చేశారు.

Champai Soren: నేను ఎక్కడ ఉన్నానో అక్కడే ఉన్నా... బీజేపీలో చేరిక వదంతులపై మాజీ సీఎం


ఎంవీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా థాకరే నిలిచే అవకాశాలపై అడిగినప్పుడు, థాకరే ముందుకు రావాల్సిన అవసరం లేదని, 2019లో కూడా ఆయన ముందుకు రాలేదని, కలిసికట్టుగా ఆయనను సీఎంను చేశారని సంజయ్ రౌత్ సమాధానమిచ్చారు. 2024 ఎన్నికల విషయంలోనూ ఆయన ఎప్పుడూ సీఎం అవుతానని చెప్పలేదని, నిన్న ఆయన చేసిన ప్రసంగం వింటే ఆ విషయం అర్ధమవుతుందని చెప్పారు. కాంగ్రెస్-ఎన్‌సీపీ నుంచి సీఎం అభ్యర్థి ఉండి, ముందుకు వస్తే మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని థాకరే చెప్పారని, అయితే మహారాష్ట్ర ప్రజల గుండెల్లో థాకరే ఎప్పటికీ ఉంటారని రౌత్ వివరించారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 17 , 2024 | 09:10 PM