Share News

UP: గుడికని వెళ్లి శవాలై తేలారు.. చెట్టుకు వేలాడుతూ కనిపించిన ఇద్దరమ్మాయిల మృతదేహాలు

ABN , Publish Date - Aug 27 , 2024 | 03:29 PM

ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో ఘోరం చోటుచేసుకుంది. ఇద్దరు అమ్మాయిలు చెట్టుకు వేలాడుతూ శవమై కనిపించడం తీవ్ర విషాదాన్ని నింపింది. కోత్‌వాలీ కాయమ్‌గంజ్ ప్రాంతంలోని భగౌతిపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఇద్దరు బాలికలు జన్మాష్టమి సందర్భంగా గుడికి బయలుదేరినట్టు తెలుస్తోంది.

UP: గుడికని వెళ్లి శవాలై తేలారు.. చెట్టుకు వేలాడుతూ కనిపించిన ఇద్దరమ్మాయిల మృతదేహాలు

ఫరూఖాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో ఘోరం చోటుచేసుకుంది. ఇద్దరు అమ్మాయిలు చెట్టుకు వేలాడుతూ శవమై కనిపించడం తీవ్ర విషాదాన్ని నింపింది. కోత్‌వాలీ కాయమ్‌గంజ్ ప్రాంతంలోని భగౌతిపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఇద్దరు బాలికలు జన్మాష్టమి సందర్భంగా గుడికి బయలుదేరినట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి వరకూ ఇంటికి చేరుకోకపోవడంతో వారిద్దరూ తమ బంధువుల ఇంట్లో ఉండవచ్చని కుటుంబ సభ్యులు భావించారు. అయితే ఈ ఇద్దరూ ఒకే దుప్పట్టాకు చుట్టబడి మృతదేహాలుగా చెట్టుకు వేలాడుతూ కనిపించడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు. తమ ఇద్దరు కుమార్తెలను హత్యచేసి, వారి శవాలను చెట్టుకు వేలాడదీసినట్టు కుటుంబ సభ్యలు ఆరోపించారు. కాగా, సమాచారం అందిన వెంటనే స్థానిక ఎస్పీ, ఫోరెన్సిక్ టీమ్ ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపారు.

Nabanna rally: యుద్ధరంగంగా మారిన కోల్‌కతా రోడ్లు.. విద్యార్థులపై వాటర్ కేనన్లు, టియర్ గ్యాస్


నిష్పాక్షిక దర్యాప్తునకు అఖిలేష్ డిమాండ్

కాగా, జన్మాష్టమి వేడుకల కోసం ఇంటి నుంచి బయలుదేరిన ఇద్దరు అమ్మాయిలు శవాలై చెట్టుకు వేలాడుతూ కనిపించిన ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. యువతుల అనుమానాస్పద మృతిపై బీజేపీ ప్రభుత్వం నిష్పాక్షిక దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు సమాజంలో భయభ్రాంతులను సృష్టిస్తాయని, ముఖ్యంగా మహిళా సమాజం తీవ్ర ఆందోళనకు గురవుతుందని అన్నారు. రాజకీయాలకు అతీతంగా మహిళా భద్రతపై దృష్టిసారించాలని ఆయన సూచించారు. యూపీ కాంగ్రెస్ సైతం ఈ ఘటనపై ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇద్దరు బాలికలను చెట్టుకు ఉరితీసినదెవరు? ఎందుకు ఉరితీశారు? ఎవ్వరికీ ఏమీ తెలియదు. మహిళల క్రిమిటోరియంగా రాష్ట్రం మారుతోందంటూ విమర్శించింది. నిర్భీతగా జరుగుతున్న ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునేంత వరకూ ఆడకూతుళ్లు నిర్భయంగా తిరగలేరని పేర్కొంది.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 27 , 2024 | 03:29 PM