Share News

Wedding: ఆరుగురిని వివాహం చేసుకున్న యువతి.. తల్లితో కలిసి పక్కా స్కెచ్.. ఏడో వ్యక్తిని కూడా కలవడంతో..

ABN , Publish Date - Dec 25 , 2024 | 05:53 PM

Marriage scam: పెళ్లి పేరుతో నేరాలు జరగడం ఇటీవల సర్వసాధారణమైంది. కొందరు పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతులను మోసం చేస్తుంటే.. కొందరు యువతులు అదే పెళ్లి పేరుతో యువకులను నిండా ముంచేస్తు్న్నారు. ఈ క్రమంలో చాలా మంది సినిమా తరహా స్ర్కిప్ట్‌లు రాసుకుంటూ ఎవరికీ అనుమానం రాకుండా మోసం చేస్తున్నారు. అయితే

Wedding: ఆరుగురిని వివాహం చేసుకున్న యువతి.. తల్లితో కలిసి పక్కా స్కెచ్.. ఏడో వ్యక్తిని కూడా కలవడంతో..
Uttar Pradesh woman married six

పెళ్లి పేరుతో నేరాలు చేయడం ఇటీవల సర్వసాధారణమైంది. కొందరు పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతులను మోసం చేస్తుంటే.. కొందరు యువతులు అదే పెళ్లి పేరుతో యువకులను నిండా ముంచేస్తు్న్నారు. ఈ క్రమంలో చాలా మంది సినిమా తరహా స్ర్కిప్ట్‌లు రాసుకుంటూ ఎవరికీ అనుమానం రాకుండా మోసం చేస్తున్నారు. అయితే ఇలాంటి వారు ఏదో ఒక సందర్భంలో చివరకు పోలీసులకు దొరికిపోవడం చూస్తున్నాం. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. ఓ యువతి ఏకంగా ఆరుగురిని వివాహం చేసుకుంది. ఏడో వ్యక్తిని కూడా పెళ్లి చేసుకోవాలని చూడగానే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చివరకు తల్లీకూతుళ్లలా నటిస్తూ వారు చేసిన నిర్వాకం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) బండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన పూనమ్, సంజనా గుప్తా కలిసి సులభంగా డబ్బు సంపాదించేంకు వివిధ రకాలుగా ఆలోచించేవారు. చివరకు వారిద్దరూ మాట్టాడుకుని పక్కా పథకం ప్రకారం ప్లాన్‌ను అమలు చేశారు. ఈ క్రమంలో పూనమ్ కూతురుగా, సంజనా గుప్తా తల్లిగా నటించడం స్టార్ట్ చేశారు. వీరికి విమలేష్, ధర్మేంద్ర అనే ఇద్దరు వ్యక్తులు కూడా తోడయ్యారు. పెళ్లి ప్రయత్నాలు చేసే వారిని టార్గెట్ చేశారు.


woman-married-six-people.jpg

ఇటీవల శంకర్ అనే వ్యక్తి పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుసుకున్న విమలేష్.. అతడి వద్దకు వెళ్లి పూనమ్ గురించి చెప్పాడు. ఫొటో చూపించి పెళ్లి ఫిక్స్ చేస్తానని చెప్పడంతో శంకర్ నమ్మాడు. అయితే ఇందుకోసం తనకు రూ.1.5 లక్షల నగదు ఇవ్వాలని కూడా కండీషన్ పెట్టాడు. పెళ్లి అవుతుందనే ఉద్దేశంతో శంకర్ కూడా అందుకు ఇప్పుకొన్నాడు. ఈ క్రమంలో శనివారం శంకర్‌కు పూనమ్‌ను, సంజనా గుప్తాను పరిచయం చేశారు. అనంతరం తాము అడిగిన మొత్తం డబ్బులను అడిగారు. అయితే తల్లీకూతుళ్ల ఆధార్ కార్డులు ఇవ్వాలని శంకర్ అడగడంతో వారు తటపటాయించారు. దీంతో శంకర్‌కు అనుమానం వచ్చి.. రూ.1.5 లక్షల నగదు ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో చివరకు వారంతా కలిసి శంకర్‌ను బెదిరించసాగారు.


నగదు చెల్లించి, పూనమ్‌ను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తామని శంకర్‌ను బెదిరించారు. దీంతో తనకు కొంచెం సమయం కావాలని వారికి చెప్పి అక్కడి నుంచి తప్పించుకున్న శంకర్.. నేరుగా పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వెంటనే అప్రమత్తమై పూనమ్, సంజనా గుప్తా, విమలేష్, ధర్మేంద్రను అదుపులోకి తీసుకున్నారు. విచారణంలో వీరు గతంలో ఇలా ఆరుగురితో పూనమ్‌కు వివాహం జరిపించారని, పెళ్లి అయిన కొన్ని రోజులకే నగలు, నగదుతో పారిపోయేదని తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేస్తున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - Dec 25 , 2024 | 05:59 PM