Jewellery Haunted by Ghost: బంగారు ఆభరణాలకు పట్టిన దెయ్యం.. కట్ చేస్తే మైండ్ బ్లాంక్ ట్విస్ట్..!
ABN , Publish Date - Feb 15 , 2024 | 06:35 PM
Jewellery Haunted by Ghost: మోసపోయేవాళ్లు ఉండాలే గానీ.. మోసం చేసేందుకు రెడీగా ఎంతో మంది ఉంటారు. అమాయక ప్రజలను దోచుకునేందుకు కేటుగాళ్లు రోజుకొక కొత్త మార్గం ఎంచుకుంటున్నారు. తాజాగా కొందరు మాయగాళ్లు ఓ మహిళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.. ఆమె బంగారు ఆభరణాలన్నీ ఎత్తుకెళ్లారు. కేవలం దెయ్యం పేరు చెప్పి.. ఉన్నదంతా దోచెకెళ్లారు కేటుగాళ్లు.
Jewellery Haunted by Ghost: మోసపోయేవాళ్లు ఉండాలే గానీ.. మోసం చేసేందుకు రెడీగా ఎంతో మంది ఉంటారు. అమాయక ప్రజలను దోచుకునేందుకు కేటుగాళ్లు రోజుకొక కొత్త మార్గం ఎంచుకుంటున్నారు. తాజాగా కొందరు మాయగాళ్లు ఓ మహిళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.. ఆమె బంగారు ఆభరణాలన్నీ ఎత్తుకెళ్లారు. కేవలం దెయ్యం పేరు చెప్పి.. ఉన్నదంతా దోచెకెళ్లారు కేటుగాళ్లు. జరగాల్సి నష్టం జరిగిన తరువాత వాస్తవాన్ని గ్రహించిన మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా గుర్తుందా? ఆ సినిమాలో బ్రహ్మానందం అండ్ టీమ్.. ఏవీఎస్ ఫ్యామిని దారుణంగా చీట్ చేస్తారు. నీటిలో బంగారు నగల మూట వేస్తే డబుల్ అవుతుందని చెప్పి.. ఆ ఆభరణాలను కాజేస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సీన్ కూడా సేమ్ అలాంటిదే. కాకకపోతే ఇక్కడ మరింత వెరైటీ చోరీ జరిగింది. బంగారు ఆభరణాలకు దెయ్యం పట్టిందని, అందుకే కుటుంబంలో అశాంతి నెలకొందని చెప్పి.. అందిన కాడికి దోచుకెళ్లారు.
పోలీసులు తెలిపిన వివరాలివే..
యూపీలోని ఘోరక్‌పూర్ జిల్లా కాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చార్ ఫటక్‌కు చెందిన అవినాష్ చంద్ర శ్రీవాస్తవ, భార్య చంద్రలత షాపింగ్ కోసం మొహద్దిపూర్ మార్కెట్‌కు వెళ్లారు. వీరు మార్కెట్‌లో ముగ్గురు యువకులను కలిశారు. తమ కుటుంబంలో సమస్యలపై యంత్ర తంత్రాల గురించి మాట్లాడారు. చంద్రలతను చూసిన మాయగాళ్లు.. ‘ఆంటీ మీ ఆరోగ్యం బాలేదు. దూరం నుంచి చూడగానే మీరు కనిపించారు. మేము తాంత్రికులం. ప్రజలకు మేలు చేస్తాం. మేం కలిశాం కాబట్టి ఇక మీకు ఎలాంటి సమస్యా ఉండదు. అయితే, ఒక పూజ చేయాల్సి ఉంటుంది.’ అని చెప్పి నమ్మబలికారు.
నగలపై కన్ను..
చంద్రలత ధరించిన బంగారు ఆభరణాల్లో దెయ్యం పట్టిందని ఆ ముగ్గురు మాయగాళ్లు నమ్మించారు. దీని కారణంగానే ఆమె అనారోగ్యానికి గురవుతున్నారని భయపెట్టారు. ‘నగలు తీసి కింద పెడితే.. భూతవైద్యం చేసి.. ఆ నగల్లో ఉన్న దెయ్యాన్ని వేరు చేసి బంధిస్తాం. ఆ తరువాత ఆ భూతాన్ని పూజా స్థలానికి తీసుకెళ్లి మీ జోలికి రాకుండా చూస్తాం.’ అంటూ నమ్మించారు. వీరి మాటలను గుడ్డిగా నమ్మిన మహిళ.. నగలను తీసి ఒక మూటలో పెట్టింది.
కళ్లు మూయగానే జంప్..
మహిళ తన నగలును తీసి పక్కన ఒక పర్స్‌లో పెట్టింది. ఆ వెంటనే ముగ్గురు యువకులు భూత వైద్యం చేస్తున్నట్లుగా నటించారు. ఓ యువకుడు మహిళను కళ్లు మూసుకుని దేవుడిని ప్రార్థించమని కోరాడు. ఇలా చేస్తే మంత్రం వేగంగా పని చేస్తుందని నమ్మించాడు. ముగ్గురు యువకుల్లో ఓ యువకుడు మంత్రం పఠిస్తుండగా.. మరో ఇద్దరు మహిళ బంగారు ఆభరణాలు పెట్టిన పర్స్‌ను తీసుకుని వెళ్లిపోయారు. ఆ తరువాత మూడో యువకుడు కూడా పారిపోయాడు. అమాయకత్వంలో కళ్లు మూసుకుని కూర్చున్న మహిళ.. మంత్రాలు ఆగిపోవడంతో కళ్లు తెరిచి చూసింది. ఎదురుగా ఎవరూ లేరు. నగలు తీసుకుని వారు జంప్ అవడాన్ని గుర్తించి.. లబోదిబోమని కేకలు వేసింది.
పోలీసులకు ఫిర్యాదు..
నిందితులు దొరక్కపోవడంతో బాధిత మహిళ తన భర్తతో కలిసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. జరిగిన విషయాన్ని పోలీసులకు తెలియజేసి.. తమకు న్యాయం చేయాలని వేడుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.
అయినా బంగారు ఆభరణాలకు దెయ్యం పట్టిందని నమ్మడం ఏంటి? ఇలా మోసపోయే వాళ్లు ఉన్నంతకాలం.. మోసగాళ్లదే రాజ్యం అవుతుంది. అందుకే.. కేటుగాళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.