Share News

Vande Bharat Trains: వందే భారత్‌ ప్రత్యేక రైళ్లు వచ్చేస్తున్నయి.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

ABN , Publish Date - Mar 29 , 2024 | 08:22 AM

ప్రయాణికుల రద్దీ నియంత్రించేలా చెన్నై ఎగ్మూర్‌ - నాగర్‌కోయిల్‌ మధ్య వందే భారత్‌ ప్రత్యేక రైళ్లు(Vande Bharat Special Trains) నడపనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది.

Vande Bharat Trains: వందే భారత్‌ ప్రత్యేక రైళ్లు వచ్చేస్తున్నయి.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

- చెన్నై - నాగర్‌కోయిల్‌ వందే భారత్‌ రైళ్లు

చెన్నై: ప్రయాణికుల రద్దీ నియంత్రించేలా చెన్నై ఎగ్మూర్‌ - నాగర్‌కోయిల్‌ మధ్య వందే భారత్‌ ప్రత్యేక రైళ్లు(Vande Bharat Special Trains) నడపనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. ఎగ్మూర్‌ నుంచి ఈనెల 30, 31 తేదీల్లో తెల్లవారు జామున 5.15 గంటలకు బయల్దేరే వందేభారత్‌ మధ్యాహ్నం 2.10 గంటలకు నాగర్‌కోయిల్‌ చేరుకుంటుంది. నాగర్‌కోయిల్‌ నుంచి మధ్యాహ్నం 2.50 గంటలకు బయల్దేరి రాత్రి 11.45 గంటలకు ఎగ్మూర్‌ చేరుకుంటుంది. ఈ రైళ్లు తాంబరం, విల్లుపురం, తిరుచ్చి, దిండుగల్‌, మదురై, విరుదునగర్‌, తిరునల్వేలి స్టేషన్లలో ఆగుతాయి.

Updated Date - Mar 29 , 2024 | 08:22 AM