Share News

Vijayadharani: నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదు.. బీజేపీ అధిష్థానం ఎంపీ సీటిస్తే కచ్చితంగా పోటీ..

ABN , Publish Date - Mar 14 , 2024 | 11:50 AM

తాను ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అధిష్థానం తనకు ఎంపీ సీటు ఇస్తే మాత్రం కచ్చితంగా పోటీ చేస్తానని ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీ(BJP)లో చేరిన మహిళా రాజకీయ నేత విజయధరణి(Vijayadharani) తెలిపారు.

Vijayadharani: నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదు.. బీజేపీ అధిష్థానం ఎంపీ సీటిస్తే కచ్చితంగా పోటీ..

- విజయధరణి

చెన్నై: తాను ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అధిష్థానం తనకు ఎంపీ సీటు ఇస్తే మాత్రం కచ్చితంగా పోటీ చేస్తానని ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీ(BJP)లో చేరిన మహిళా రాజకీయ నేత విజయధరణి(Vijayadharani) తెలిపారు. ఆమె బుధవారం నాగర్‌కోయిల్‌లో విలేకరులతో మాట్లాడుతూ... ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మరింత బలం చేకూర్చేలా తమ పనితీరు ఉంటుందన్నారు. దేశంలోని సామాన్య ప్రజానీకం ఉన్నత పదవుల్లోకి రావాలని ప్రధాని మోదీ బలంగా కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో మహిళలకు సముచిత స్థానం, గౌరవ మర్యాదలు లేవన్నారు. తనకు కూడా ఏదో ఒక పదవి ఇచ్చి, సముచిత స్థానాన్ని కల్పిస్తుందన్న బలమైన నమ్మకం ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తన ఎదుగుదలను కోరుకోలేదన్నారు. ఆ పార్టీలో కుటుంబ వారసులకు మాత్రమే పెద్ద పీట వేస్తున్నారన్నారు. కన్నియాకుమారి లోక్‌సభ స్థానం నుంచి కొన్నేళ్లుగా వారసులే పోటీ చేస్తున్నారని, ఏదైనా అభివృద్ధి జరిగిందా? అని ఆమె ప్రశ్నించారు. ఈ స్థానం నుంచి తాను పోటీ చేయాలని కోరుకోవడం లేదని, కానీ పార్టీ ఆదేశిస్తే మాత్రం పోటీ చేస్తానని విజయధరణి తెలిపారు.

nani2.2.jpg

Updated Date - Mar 14 , 2024 | 11:50 AM