Share News

West Bengal Bypolls: పోలింగ్ డే.. 4 అసెంబ్లీ స్థానాల్లోనూ టీఎంసీ, బీజేపీ హోరాహోరీ

ABN , Publish Date - Jul 09 , 2024 | 04:02 PM

తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మరోసారి ఉప ఎన్నికల బరిలో హోరాహోరీగా తలబడనున్నాయి. పశ్చిమబెంగాల్‌ లోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలకు ఈనెల 10వ తేదీన పోలింగ్ జరగనుండటంతో గెలుపుపై రెండు పార్టీలు గట్టి ధీమాతో ఉన్నాయి.

West Bengal Bypolls: పోలింగ్ డే.. 4 అసెంబ్లీ స్థానాల్లోనూ టీఎంసీ, బీజేపీ హోరాహోరీ

కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో ఉత్సాహంతో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (TMC), గతం కంటే లోక్‌సభ సీట్లు తగ్గినా పార్టీ సత్తా తగ్గలేదని చాటుకునేందుకు బీజేపీ (BJP) మరోసారి నెల తిరక్కుండానే హోరాహోరీగా తలబడనున్నాయి. నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నికల (Assembly bypolls)కు ఈనెల 10వ తేదీన పోలింగ్ జరగనుండటంతో గెలుపుపై రెండు పార్టీలు గట్టి ధీమాతో ఉన్నాయి. మానిక్‌తలా, రాయ్‌గంజ్, రానాఘాట్ దక్షిణ్, బగ్‌దాహ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బుధవారంనాడు పోలింగ్ జరుగనుంది.


ఉప ఎన్నికలు జరుగుతున్న 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ టీఎంసీతో బీజేపీ తలపడుతోంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నాలుగు సీట్లలో మూడు సీట్లను బీజేపీ గెలుచుకుంది. అయితే గెలిచిన ఎమ్మెల్యేలు అధికార టీఎంసీలోకి ఫిరాయించారు. మానిక్‌తాలా ఎమ్మెల్యే, టీఎంసీ నేత సాధన్ పాండే కన్నుమూయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. కాగా, ప్రస్తుతం ఉప ఎన్నిక జరుగుతున్న నాలుగు నియోజకవర్గాల్లో మానిక్‌తాలా, రానాఘాట్ దక్షిణ్, బగ్‌దాహ్‌లు సౌత్ బెంగాల్‌లో ఉన్నాయి. పార్టీ దివంగత నేత సాధన్ పాండే భార్య సుప్తి పాండేను మానిక్‌తాలా నుంచి టీఎంసీ ఎన్నికల బరిలోకి దింపింది. బీజేపీకి చెందిన రాయ్‌గంజ్‌ ఎమ్మెల్యే కృష్ణ కల్యాణి, బగ్‌దాహ్ ఎమ్మెల్యే బిశ్వజిత్ దాస్, రానాఘాట్ దక్షిణ్ ఎమ్మెల్యే ముకుట్ మణి అధికారి ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సొంత పార్టీని వీడి టీఎంసీలో చేరిపోయారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కార్తీక్ చంద్రపాల్ చేతిలో కల్యాణి ఓడిపోవడంతో ఆమె తిరిగి రాయ్‌గంజ్ అసెంబ్లీలో పోటీకి దిగారు. రానాఘాట్ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేత జగన్నాథ్ సర్కార్‌ చేతిలో ఓడిపోయిన అధికారి రానాఘాట్ దక్షిణ్ అసెంబ్లీ సీటు నుంచి ప్రస్తుతం పోటీలో ఉన్నారు. బగ్‌దాహ్ అసెంబ్లీ నుంచి రాజ్యసభ ఎంపీ మమతాబాల ఠాకూర్ కుమార్తె మతువా ఠూకూర్‌బరిని టీఎంసీ పోటీలోకి దిపింది. మతువా మెజారిటీ నియోజకవర్గం కావడంతో టీఎంసీ గెలుపుపై గట్టి ధీమాతో కూడా ఉంది. కాగా, బీజేపీ తమ అభ్యర్థులుగా మానిక్‌తాలా నుంచి ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు కల్యాణ్ చౌబేను, రానాఘాట్ దక్షిణ్ నుంచి మనోజ్ కుమార్ బిస్వాస్‌ను, బగ్‌దాహ్‌ నుంచి బినయ్ కుమార్ బిశ్వాస్, రాయ్‌గంజ్‌ నుచి మానస్ కుమార్ ఘోష్‌ను పోటీకి దింపింది.

Rahul Gandhi: రాయబరేలి హనుమాన్ ఆలయంలో రాహుల్ పూజలు


ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 42 స్థానాలకు 29 సీట్లు గెలిచిన ఉత్సాహంతో ఉన్న టీఎంసీ బుధవారంనాడు జరిగే ఉప ఎన్నికల్లో నాలుగు స్థానాలను గెలుచుకుంటామనే ధీమాతో ఉంది. 2019లో 19 లోక్‌సభ సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి ఎన్నికల్లో 12 స్థానాలకు పడిపోయినప్పటికీ బగ్‌దాహ్, రానాఘాట్ దక్షిణ్, రాయ్‌గంజ్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో గెలుపుపై ధీమాగా ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో ఈ మూడు అసెంబ్లీ సెగ్మంట్లలో బీజేపీ లీడింగ్‌లో కొనసాగినందున తమ గెలుపు ఖాయమని చెబుతోంది.

For Latest News and National News click here

Updated Date - Jul 09 , 2024 | 04:02 PM