Train Accident: కాంచన్‌జంగా రైలు ప్రమాదానికి కారణమిదే..ప్రాథమిక దర్యాప్తులో..
ABN , Publish Date - Jun 17 , 2024 | 11:36 AM
పశ్చిమ బెంగాల్లోని(west bengal) డార్జిలింగ్ జిల్లాలో ఈరోజు ఉదయం భారీ రైలు ప్రమాదం(train accident) సంభవించింది. గూడ్స్ రైలు ఆగి ఉన్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను ఢీ కొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 15 మంది మృతి చెందగా, 60 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలేంటో ఇప్పుడు చుద్దాం.
పశ్చిమ బెంగాల్లోని(west bengal) డార్జిలింగ్ జిల్లాలో ఈరోజు ఉదయం భారీ రైలు ప్రమాదం(train accident) సంభవించింది. రంగపాణి స్టేషన్‌కు సమీపంలోని రుయిదాస వద్ద గూడ్స్ రైలు ఆగి ఉన్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ (Kanchanjunga express) ట్రైన్‌ను ఢీ కొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ మూడు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 15 మంది మృతి చెందగా, 60 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్‌లు, స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నాయి.
రైల్వే మంత్రి
రైలు ప్రమాద ఘటనపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోషల్ మీడియా ఎక్స్ వేదిగా ట్వీట్ చేసి విచారం వ్యక్తం చేశారు. ఎన్‌ఎఫ్‌ఆర్ జోన్‌లో ఘోర ప్రమాదం జరిగిందని ఆయన పేర్కొన్నారు. సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయని, రైల్వే, NDRF, SDRF బృందాలు కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారని, ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారని వెల్లడించారు.
అయితే ఈ ప్రమాదానికి గల కారణం గూడ్స్ రైలు సిగ్నల్‌ను అధిగమించి కాంచన్‌జంగా రైలును వెనుక నుంచి ఢీకొట్టిందని ప్రాథమిక దర్యాప్తులో అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మరింత సమాచారం సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలను విశ్లేషిస్తున్నారు. ఈ యాక్సిడెంట్ నేపథ్యంలో అగర్తల-కోల్‌కతా రైలు మార్గం పూర్తిగా దెబ్బతింది.
ఇది కూడా చదవండి:
First Video: ఎక్స్‌ప్రెస్ రైలును ఢీకొన్న గూడ్స్ ట్రైన్..ఐదుగురు మృతి, 30 మందికి..
EVMs: ఈవీఎం వ్యాఖ్యలపై ఎలాన్ మస్క్‌కి కేంద్ర మాజీ మంత్రి కౌంటర్
Elon Musk: ఈవీఎంల గురించి ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు..ఏమన్నారంటే
Read Latest National News and Telugu News