Suresh: లోక్‌సభ స్పీకర్ పదవి కోసం పోటీ చేసిన సురేష్ ఎవరు?
ABN , Publish Date - Jun 26 , 2024 | 12:40 PM
ఈసారి 18వ లోక్‌సభ స్పీకర్ పదవి(Lok Sabha Speaker Election) కోసం 48 ఏళ్ల తర్వాత మళ్లీ ఎన్నిక జరిగింది. సంప్రదాయం ప్రకారం లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లను అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం ద్వారా ఎన్నుకుంటారు. అయితే ఇరు పక్షాల మధ్య ఏర్పడిన నిర్ణయాల వల్ల ఈసారి ఎన్నికలకు దారితీసింది. అసలు ఇండియా కూటమి నుంచి పోటీ చేసిన సురేష్ ఎవరు, ఆయన విశేషాలేంటనే వివరాలను ఇప్పుడు చుద్దాం.
ఈసారి 18వ లోక్‌సభ స్పీకర్ పదవి(Lok Sabha Speaker Election) కోసం 48 ఏళ్ల తర్వాత మళ్లీ ఎన్నిక జరిగింది. సంప్రదాయం ప్రకారం లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లను అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం ద్వారా ఎన్నుకుంటారు. అయితే ఇరు పక్షాల మధ్య ఏర్పడిన నిర్ణయాల వల్ల ఈసారి ఎన్నికలకు దారితీసింది. చరిత్రలో 1952, 1967, 1976లో మూడు సార్లు మాత్రమే ఈ పదవికి ఎన్నికలు జరిగాయి. స్పీకర్ పదవి కోసం అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇరు పక్షాలు అభ్యర్థులను బరిలోకి దించాయి.
ఎన్‌డీఏ నుంచి ఎంపీ ఓం బిర్లా(Om Birla), ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ కే సురేష్(k Suresh) పోటీ చేశారు. ఈ క్రమంలో నేడు బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రతిపాదించిన ఓం బిర్లా బుధవారం ముజువాణి ఓటు ద్వారా ఎన్నికయ్యారు. అయితే అసలు ఇండియా కూటమి నుంచి పోటీ చేసిన సురేష్ ఎవరు, ఆయన విశేషాలేంటనే వివరాలను ఇప్పుడు చుద్దాం.
1989లోనే మొదటిసారి
లోక్‌సభ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన దళిత నేత, కొడికున్నిల్ సురేష్(k Suresh) కాంగ్రెస్ ఎంపీ, పార్లమెంట్ దిగువసభలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్‌గా ఉన్నారు. తిరువనంతపురంలోని కోడికున్నిల్‌లో జన్మించిన సురేష్ 1989లో మొదటిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1991,1996, 1999 సార్వత్రిక ఎన్నికల్లో అదూర్ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు విజయం సాధించారు. కానీ 1998, 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2009లో సురేష్ మావెలికర లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అయితే ఆయన కుల ధ్రువీకరణ పత్రం నకిలీదన్న ఆరోపణలపై కేరళ హైకోర్టు దానిని రద్దు చేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆ తీర్పును రద్దు చేసింది.
ఎనిమిది సార్లు ఎంపీ
2018లో సురేష్ కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. గతంలో ఆయన కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) కార్యదర్శిగా కూడా పనిచేశారు. కె సురేష్ ఎనిమిది సార్లు ఎంపీ. కేరళలోని మావెలిక్కర లోక్‌సభ స్థానం నుంచి ఆయన గెలుపొందారు. 2009లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో కూడా సురేష్ కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రిగా చేశారు. 2012 నుంచి 2014 వరకు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు.
ఇటివల ఎన్నికల్లో 10 వేల ఓట్లతో
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సీపీఐ యువనేత అరుణ్‌కుమార్‌పై కె.సురేష్ 10,868 వేల ఓట్లతో విజయం సాధించారు. కేరళ(kerala)లో ఆయన గెలుపులో ఇదే అతి తక్కువ తేడా. మావెలిక్కర లోక్‌సభలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ స్థానాలన్నీ సీపీఐ (ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్) చేతిలో ఉన్నాయి. కె సురేష్ లోక్‌సభ ఎన్నికల్లో రూ.1.5 కోట్ల ఆస్తులను ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
Om Birla 2.0: ఓం బిర్లా ఎవరు.. రాజకీయ నేపథ్యమేంటి?
Rahul Gandhi : విపక్ష నేతగా రాహుల్
For Latest News and National News click here