Share News

Uddhav Thackeray: మాది వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్.. ఉద్ధవ్ థాకరే

ABN , Publish Date - Aug 16 , 2024 | 02:54 PM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 'మహా వికాస్ అఘాడి' గెలుపు ఖాయమని, తమది వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ అని శివసేన నేత ఉద్ధవ్ థాకరే అన్నారు. ఒక మ్యాచ్ (లోక్‌సభ ఎన్నికలు) ఇప్పటికే గెలిచామని, మరో మ్యాచ్ గెలవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

Uddhav Thackeray: మాది వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్.. ఉద్ధవ్ థాకరే

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 'మహా వికాస్ అఘాడి' (MVA) గెలుపు ఖాయమని, తమది వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ అని శివసేన (UBT) నేత ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray)అన్నారు. ఒక మ్యాచ్ (లోక్‌సభ ఎన్నికలు) ఇప్పటికే గెలిచామని, మరో మ్యాచ్ గెలవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ శుక్రవారంనాడు ప్రకటించే అవకాశాలున్న నేపథ్యంలో ఉద్ధవ్ థాకరే మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసికట్టుగా పోరాడటానికి 'మహా వికాస్ అఘాడి' సిద్ధంగా ఉందని చెప్పారు. కాంగ్రెస్, ఎన్‌సీపీ-ఎస్‌పీలు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రతిపాదిస్తే వారికి తమ మద్దతు ఉంటుందన్నారు. కలిసికట్టుగా మహారాష్ట్ర అభివృద్ధికి పాటుపడటమే తమ లక్ష్యమని చెప్పారు.


బీజేపీతో తమకు పొత్తు ఉన్నప్పుడు ఎక్కువ మంది ఎమ్మెల్యేలున్న పార్టీ నుంచే సీఎంను ఎన్నుకునే వారని, ఆ అనుభవం దృష్ట్యా తాము దీనికి దూరంగా ఉండాలని అనుకుంటున్నామని చెప్పారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలున్న పార్టీకే సీఎం పదవి కట్టబెట్టడానికి తాము సానుకూలం కాదని తెలిపారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వాన్ని గతంలో కూల్చేశారని, తమ పార్టీ పేరు, గుర్తు లూటీ చేశారని ఏక్‌నాథ్ షిండే శివసేనను పరోక్షంగా థాకరే తప్పుపట్టారు. ఈరోజు ఎన్నికలు ప్రకటించినా సమష్టిగా పోరాటం చేసి ఎన్నికల్లో గెలిచితీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు మహారాష్ట్ర ఆత్మగౌరవానికి సంబంధించిన ఎన్నికలుగా అభివర్ణించారు. ఈరోజు ఉన్న బీజేపీ అసలైన బీజేపీ కాదని విమర్శించారు.

Manipur Issue: ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ మళ్లీ విజ్ఞప్తి


ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు?

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీఐ శుక్రవారంనాడు ప్రకటించనుండగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇప్పుడే ఉండకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. హర్యానా, జమ్మూకశ్మీర్‌ ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఈ ఏడాది చివర్లో (నవంబర్‌లో) మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 16 , 2024 | 03:00 PM