Share News

Crime News: కాలేజీలో దారుణం.. ప్రేమించలేదనే అక్కసుతో అందరూ చూస్తుండగా ప్రియురాలిపై..

ABN , Publish Date - Apr 19 , 2024 | 03:04 PM

ప్రేమ.. రెండక్షరాలే.. కానీ.. చేసే హంగామా అంతా ఇంతా కాదు. ప్రేమించిన వ్యక్తి పక్కన ఉంటే చాలు ఇంకెవరూ అవసరం లేదు అని ఫీలయ్యే ప్రేమికులూ చాలా మందే ఉన్నారు.

Crime News: కాలేజీలో దారుణం.. ప్రేమించలేదనే అక్కసుతో అందరూ చూస్తుండగా ప్రియురాలిపై..

ప్రేమ.. రెండక్షరాలే.. కానీ.. చేసే హంగామా అంతా ఇంతా కాదు. ప్రేమించిన వ్యక్తి పక్కన ఉంటే చాలు ఇంకెవరూ అవసరం లేదు అని ఫీలయ్యే ప్రేమికులూ చాలా మందే ఉన్నారు. ప్రేమలో అంచనాలు ఉండవు. అర్థం చేసుకోవడం మాత్రమే ఉంటుంది. ఇద్దరి మధ్య ఎంత సఖ్యత ఉన్నా కొన్ని కొన్ని సార్లు మనస్పర్థలు వస్తాయి. వాటిని వెంటనే పరిష్కరించుకోవాలి. లేకపోతే విడిపోయేందుకూ దారి తీస్తాయి. కానీ కొందరు ప్రేమను తిరస్కరిస్తే తట్టుకోలేరు. అవసరమైతే దాడికి ( Crime News ) పాల్పడతారు. కొన్ని సార్లు హత్య చేసేందుకూ వెనకాడరు. తాజాగా కర్ణాటకలోని హుబ్లీలో అలాంటి ఘటనే జరిగింది. తన ప్రేమను తిరస్కరించిందనే కారణంతో ఓ యువకుడు యువతిపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు.


Elections 2024: ఎన్నికల వేళ హింసతో అట్టుడుకుతున్న బెంగాల్.. కూచ్ బిహార్ లో రాళ్లదాడి..

కర్ణాటకలోని హుబ్లీకి చెందిన నేహా హిర్మత్ స్థానిక బీవీబీ కళాశాలలో ఎంసీఏ చదువుతోంది. ఆదే కాలేజీలో బెళగావి జిల్లా సవదత్తికి చెందిన ఫయాజ్ చదువుతున్నాడు. వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడటంతో తనను ప్రేమించాలని ఫయాజ్ నేహాను వేధించడం ప్రారంభించాడు. ఆమె ఎంతకీ ఒప్పుకోకపోవడంతో ఫయాజ్ కు కోపం వచ్చింది. దీంతో పట్టపగలు కాలేజీ క్యాంపస్‌లో అందరూ చూస్తుండగానే నేహాపై దాడికి పాల్పడ్డాడు. ఆమె మెడపై కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. తోటి విద్యార్థులు వెంటనే అప్రమత్తమై కాలేజీ యాజమాన్యానికి సమాచారం అందించారు. వారు స్పాట్ కు చేరుకుని ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Devotional: విశాఖలో వైభవంగా మేధా దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు..

విద్యార్థిని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. అతడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కుమారుడు, బీజేపీ నేత విజయేంద్ర యడియూరప్ప స్పందించారు. మహిళలపై దాడులు, హత్యలు వంటి నేరాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 19 , 2024 | 03:05 PM