Pinarayi Vs Rahul: జైళ్ల పేరుతో మమ్మల్ని భయపెట్టొద్దు... రాహుల్‌కు కేరళ సీఎం పంచ్
ABN , Publish Date - Apr 19 , 2024 | 08:08 PM
'ఇండియా' కూటమిలో మిత్రులు, కేరళలో ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేరళ సీపీఎం నేత, ముఖ్యమంత్రి పినరయి విజయన్ మధ్య వాగ్యుద్ధం కొనసాగుతోంది. రాహుల్ గాంధీ ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యలపై పినరయి విజయన్ శుక్రవారం ఘాటుగా స్పందించారు. మీ నాన్నమ్మ కూడా జైలుకు వెళ్లారని గుర్తుచేశారు.
న్యూఢిల్లీ: 'ఇండియా' కూటమిలో మిత్రులు, కేరళలో ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) , కేరళ సీపీఎం నేత, ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) మధ్య వాగ్యుద్ధం కొనసాగుతోంది. రాహుల్ గాంధీ ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యలపై పినరయి విజయన్ శుక్రవారం ఘాటుగా స్పందించారు. మీ నాన్నమ్మ (Indira Gandhi) కూడా జైలుకు వెళ్లారని గుర్తుచేశారు. ''జైళ్లు మాకేమీ కొత్త కాదు, మమ్మల్ని జైళ్లు, కేసుల పేరుతో భయపెట్ట లేరు'' అని వ్యాఖ్యానించారు.
ఎవరేమన్నారు..?
కొద్దికాలంగా రాహుల్, విజయన్ మధ్య పొరపొచ్చాలు కొనసాగుతున్నాయి. పౌరసత్వ సవరణ చట్టా్న్ని కేంద్రం నోటిఫై చేసినప్పుడు రాహుల్ గాంధీని విజయన్ ప్రశ్నించారు. దీనిపై రాహుల్, కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నిచారు. దీనికితోడు వాపపక్ష నేత అన్నె రాజాపై వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ నిలబడటంతో విజయన్ అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ కోజికోడ్‌లో విజయన్‌పై చేసిన వ్యాఖ్యలతో వీరి మధ్య వివాదం ముదిరింది. ''ఈడీ, సీబీఐ, ఇతర సంస్థలు ఎందుకు విజయన్‌ను ఇంటరాగేట్ చేయడం లేదు? ఇద్దరు సీఎంలు జైలులో ఉన్నారు. కేరళ సీఎం విషయంలో ఇదెందుకు జరగడం లేదు? నేను 24 గంటలూ బీజేపీతో పోరాటం చేస్తుంటే సీఎం నామీద అటాక్ చేస్తున్నారు. ఇది చాలా ఫజిలింగ్‌గా ఉంది'' అని రాహుల్ వ్యాఖ్యానించారు.
Shah Rukh Khan: కాంగ్రెస్ ప్రచారంలో 'షారూక్'.. అసలు సంగతేమిటంటే?
ఇందిరాగాంధీ ప్రస్తావన...
రాహుల్ వ్యాఖ్యలపై పినరయి విజయన్ శుక్రవారం స్పందిస్తూ, ఇందిర హయాంలో అత్యవసర పరిస్థితిని ప్రస్తావించారు. ''మీ నానమ్మ (ఇందిరాగాంధీ) కూడా జైలుకు వెళ్లారు. మాలో చాలామంది ఏడాదిన్నర పాటు జైలులో గడిపాం. ఇంటరాగేషన్లు, జైళ్లు మాకు అనుభవమే. జైళ్లకు మేము భయపడం. ఇన్వెస్టిగేషన్, జైళ్ల పేరుతో మమ్మల్ని బెదరించకండి. మాకు ఎలాంటి భయాల్లేవు'' అని అన్నారు. రాబర్డ్ వాద్రాపై కూడా పినరయి విజయన్ విమర్శలు గుప్పించారు. బీజేపీకి రూ.170 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రాబర్డ్ వాద్రా కంపెనీ చెల్లించడం వల్లే ఆయనపై ఆయనపై ఉన్న ఆరోపణలను ఉపసంహరించుకున్నారని అన్నారు.
జాతీయ వార్తలు కోసం...