About Fasting : ఉపవాసం పరమౌషథం!
ABN , Publish Date - Aug 27 , 2024 | 02:55 AM
కాలుష్యాలతో నిండిన వాతావరణంలో శరీరం నుంచి కలుషితాలు, విషాలను వెళ్లగొట్టడానికి మెరుగైన మార్గం ఉపవాసం పాటించడం.
గుడ్ హెల్త్
కాలుష్యాలతో నిండిన వాతావరణంలో శరీరం నుంచి కలుషితాలు, విషాలను వెళ్లగొట్టడానికి మెరుగైన మార్గం ఉపవాసం పాటించడం.
ఆధునిక యుగంలోని మనమంతా ఉదయం తీసుకునే అల్పాహారమే రోజంతటిలో అత్యంత ముఖ్యమైన ఆహారమని అనుకుంటాం. కానీ మధ్యాహ్న భోజనానికే ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలని వైద్యులు అంటున్నారు. మధ్యాహ్న సమయానికి జీర్ణ అగ్ని ఎక్కువ శక్తిమంతంగా ఉంటుంది. కాబట్టి మధ్యాహ్న భోజనం భారీగా ఉండాలి.
కాబట్టి రోజంతా భోజనం మానేసి, ఉపవాసం ఉండే బదులు అడపా దడపా ఉపవాసం ఉండడం వల్ల ఫలితం ఉంటుంది. ఏదో ఒక పూట ఉపవాసం ఉండడం కాకుండా, చివరి భోజనానికి, తదుపరి భోజనానికీ మధ్య 14 నుంచి 18 గంటల విరామం ఉండాలి.
ప్రతి రోజూ రెండు భోజనాలకు మధ్య కనీసం 16 గంటల విరామం ఇస్తే, శక్తి స్థాయులు పెరుగడం స్పష్టంగా అనుభవంలోకి వస్తుంది. ఉదయం తీసుకునే టీ, కాఫీలో రెండు చెంచాల పాలు కలుపుకుని చక్కెర లేకుండా తాగాలి.
రాత్రి తింటే, తిరిగి మధ్యాహ్న భోజనమే చేయాలి. ఈ నియమం పాటిస్తే రాత్రి భోజనానికీ, మధ్యాహ్న భోజనానికీ మధ్య 14 నుంచి 18 గంటల విరామం దక్కుతుంది. ఈ ఉపవాసంతో అధిక బరువు తగ్గుతాం. మరీముఖ్యంగా పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరుగుతుంది. కణ మరమ్మత్తు జరుగుతుంది. టైప్ 2 మధుమేహానికి గురయ్యే వీలు ఉండదు. హార్మోన్ల అవకతవలు తగ్గుతాయి.