Health Tips : ఆహారంతో ఆలోచించి..
ABN , Publish Date - Aug 27 , 2024 | 02:50 AM
కొన్ని ఆరోగ్య సమస్యలకు సమాధానం ఆహారంలోనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇన్‌ఫ్లమేషన్ లక్షణాలను ఆహారంతో మెరుగ్గా అదుపులోకి తెచ్చుకోవచ్చు.
ఇన్‌ఫ్లమేషన్
కొన్ని ఆరోగ్య సమస్యలకు సమాధానం ఆహారంలోనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇన్‌ఫ్లమేషన్ లక్షణాలను ఆహారంతో మెరుగ్గా అదుపులోకి తెచ్చుకోవచ్చు.
నొప్పులు, వాపులు వ్యాధికి తొలి సూచనలు. కీళ్ల నొప్పులు (ఆర్థ్రయిటిస్), హృద్రోగ సమస్యలు, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ (విరేచనాలు), మధుమేహం, కొన్ని రకాల కేన్సర్లలో కూడా ఇవే ప్రధాన లక్షణాలు. తింటున్న పదార్థాలు సరిపడకపోతే పేగుల్లో వాపు మొదలవుతుంది.
ఈ సమస్యే మున్ముందు హార్మోన్ల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కొంతమందికి చుబుకం మీద మొటిమలు తలెత్తుతాయి. ఇందుకు కారణం పాల ఉత్పత్తులు సరిపడకపోవడమే.
ఇలాంటి ఇన్‌ఫ్లమేషన్‌కు కలిగించే పదార్థాల్లో ప్రధానమైనవి... చక్కెర, ఎర్రని మాంసం, గ్లూటేన్. మాంసం, చక్కెరలు చర్మపు పిహెచ్ విలువలను మార్చేస్తాయి. అంతే కాదు, పెద్ద పేగుల్లోని ఉపయోగకరమైన బ్యాక్టీరియానూ మారుస్తాయి.
పొట్టు తీయని, పాలిష్ పట్టించని ధాన్యాలు, సేంద్రీయ కూరగాయలు, పళ్లు, పసుపు, బ్రక్కొలి, నిమ్మ ఎక్కువగా తినగలిగితే ఇన్‌ఫ్లమేషన్ అదుపులోకొస్తుంది. మద్యపానం, ధూమపానం, తీపిపదార్థాలు ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచుతాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. ఉపవాసంతో కూడా ఇన్‌ఫ్లమేషన్ అదుపులోకొస్తుంది. కంటి నిద్ర కూడా కీలకమే!