Share News

Health Tip : ఓం ప్రభావం

ABN , Publish Date - Jun 10 , 2024 | 11:48 PM

ఓంకారాన్ని పలకడం ద్వారా నాడీ వ్యవస్థ ప్రేరేపితమై, సాంత్వన దక్కుతుంది. ఇలా ఓంను పలకడం వల్ల శ్వాస క్రమబద్ధమై, రక్తపోటు కూడా తగ్గుతుంది.

Health Tip : ఓం ప్రభావం

గుడ్‌ హెల్త్‌

ఓంకారాన్ని పలకడం ద్వారా నాడీ వ్యవస్థ ప్రేరేపితమై, సాంత్వన దక్కుతుంది. ఇలా ఓంను పలకడం వల్ల శ్వాస క్రమబద్ధమై, రక్తపోటు కూడా తగ్గుతుంది. ఓంకారం, మెదడు నుంచి శరీరం చివరి వరకూ సాగే వేగస్‌ నాడిని ప్రేరేపించి, గుండె వేగం, జీర్ణక్రియలను క్రమబద్ధం చేస్తుంది. మనసుకు సాంత్వన సమకూరి, హాయిగా నిద్రలోకి జారిపోయే శక్తి ఓంకారానికి ఉంది. 12 సార్లు ఓంకారాన్ని పలికితే, నిద్రలేమి, ఒత్తిడి తొలగిపోతాయి. కాబట్టి ఒత్తిడి, ఆందోళనలతో బాధపడేవారు 12 సార్లు ఓంకారాన్ని పలికితే తప్పక ఫలితం దక్కుతుందని నిపుణులు అంటున్నారు.

Updated Date - Jun 10 , 2024 | 11:48 PM