Health Tips : రోజుకు గుప్పెడు పిస్తాపప్పులు తీసుకుంటే చాలు, లైంగిక శక్తి పెరుగుతుందట..!
ABN , Publish Date - May 07 , 2024 | 03:50 PM
పిస్తాపప్పులు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్‌తో నిండి ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు దాదాపు 40 శాతం ప్రోటీన్ అద్భుతమైన మూలం, ఆరోగ్యకరమైన జుట్టు, చర్మాన్ని కీలకమైన విటమిన్ ఇ కలిగి ఉంటుంది.
రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలలో పిస్తాలు ముందుంటాయి. వీటిని తింటే శక్తి పెరుగుతుందని తెలిసిందే. శరీరాన్ని దృఢంగా మార్చే ఆహారాలలో పిస్తాలు కూడా ఉన్నాయి. ఈ పిస్తాలను క్రమం తప్పకుండా తీసుకుంటే లైంగిక శక్తిని కూడా పెంచుతాయి. ఇవి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పిస్తాలో జింక్ విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, ఫైబర్ వంటి అవసరమైన పోషకాలున్నాయి. పిస్తాపప్పులు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్ తో నిండి ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు దాదాపు 40 శాతం ప్రోటీన్ అద్భుతమైన మూలం, ఆరోగ్యకరమైన జుట్టు, చర్మాన్ని కీలకమైన విటమిన్ ఇ కలిగి ఉంటుంది.
పిస్తా లైంగిక ఆరోగ్యానికి..
పురుషులలో సంతానోత్పత్తి, లైంగిక ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడే శక్తివంతమైన కామోద్దీపన లక్షణాలను కలిగి ఉంది. ఇందులోని ఈస్ట్రోజన్ స్థాయిలు లైంగిక కోరికలను పెంచతాయట.
పిస్తాపప్పులు గుండెకు..
పిస్తా తీసుకోవడం వల్ల ఇది గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పెంచే చాలా ఆహారాలలో ఇది ప్రధానంగా చెప్పుకోవచ్చు.
జ్ఞాపకశక్తికి..
జ్ఞాపకశక్తిని పెంచే ఆయుధం పిస్తాపప్పు.. దీనిలోని ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
Protein Food : రోజువారి ఆహారంలో ప్రోటీన్ ఫుడ్స్ ఎలా చేర్చుకోవాలి.. !
ఎముకల పుష్టికి..
ఎముక బలానికి పిస్తా చక్కగా పనిచేస్తుంది. ఇందులోని విటమిన్ డి, కాల్షియం అవసరం. ఇవి రెండూ పిస్తాలో అధికంగా ఉన్నాయి. ఎముక బలానికి పిస్తా మంచి సపోర్ట్ ఇస్తుంది. అలాగే బోలు ఎముకల వ్యాధఇ రాకుండా చేస్తుంది.
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
పిస్తా తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఇందులోని యాంటీ కార్సినోజెనిక్ మూలాలు క్యాన్సర్ నివారించేందుకు సహకరిస్తుంది.
Hearth Health : గుండె నొప్పిని ముందుగానే తెలిపే లక్షణాలు ఎలా ఉంటాయంటే..!
కంటి ఆరోగ్యం..
కళ్లు శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. వీటి ఆరోగ్యానికి పిస్తా సహకరిస్తుంది. కంటి ఆరోగ్యాన్ని పెంచే విటమిన్ ఎ, ఇ పిస్తాలో ఉన్నాయి.
Read Latest Navya News and Thelugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.