Share News

'Inflammation' : ఇన్‌ఫ్లమేషన్‌ ఇక్కట్లు

ABN , Publish Date - Nov 05 , 2024 | 01:12 AM

బరువు తగ్గడం పెద్ద సమస్యగా మారిపోయింది. డైటింగ్‌, వ్యాయామం... ఏం చేసినా అధిక బరువు తగ్గకపోతే, అందుకు శరీరంలోని ‘ఇన్‌ఫ్లమేషన్‌’ను అనుమానించాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇన్‌ఫ్లమేషన్‌ కూడా స్థూలకాయానికి కారణమవుతుంది దీన్ని వదిలించుకోవడం కోసం ‘యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్‌’ను ఎంచుకోవాలి.

'Inflammation' : ఇన్‌ఫ్లమేషన్‌  ఇక్కట్లు

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్‌

బరువు తగ్గడం పెద్ద సమస్యగా మారిపోయింది. డైటింగ్‌, వ్యాయామం... ఏం చేసినా అధిక బరువు తగ్గకపోతే, అందుకు శరీరంలోని ‘ఇన్‌ఫ్లమేషన్‌’ను అనుమానించాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇన్‌ఫ్లమేషన్‌ కూడా స్థూలకాయానికి కారణమవుతుంది దీన్ని వదిలించుకోవడం కోసం ‘యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్‌’ను ఎంచుకోవాలి.

  • ప్రతి రోజూ ఇవి తప్పనిసరి

  1. ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్లు

  2. విటమిన్‌ డి

  3. ప్రొబయాటిక్స్‌ (పెరుగు, మజ్జిగ)

  4. పసుపు (రోజుకు ఒకటి నుంచి రెండు టీస్పూన్లు)

  5. అల్లం (రోజుకు 250 నుంచి 500 మిల్లీ గ్రాములు)

  • ప్రత్యామ్నాయాలున్నాయి

  1. తీపి కోసం: చక్కెరకు బదులుగా ముడి బెల్లం, తేనె, ఖర్జూరాలు

  2. తెల్ల బియ్యం: బ్రౌన్‌ రైస్‌, మిల్లెట్స్‌

  3. రిఫైన్డ్‌ నూనెలు: గానుగ నూనెలు, కోల్డ్‌ ప్రెస్‌డ్‌ ఆయిల్స్‌

  4. మైదా: పాలిష్‌ పట్టని గోధుమ పిండి

కొన్ని ఆరోగ్య సమస్యలకు ప్రత్యేకమైన వైద్య చికిత్సలంటూ ఉండవు. మరీముఖ్యంగా జీవనశైలితో ముడిపడి ఉండే ఒబేసిటీకి ఆహారమే ఔషధం. కొంతమంది ఎంత వ్యాయామం చేసినా, ఎంత మితంగా తింటున్నా అధిక బరువును వదిలించుకోలేకపోతూ ఉంటారు. ఈ కోవకు చెందిన ఊబకాయులు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్‌ను అనుసరించాలి. కొత్తగా, ఫ్యాషన్‌గా, ట్రెండీగా ఉండే పదార్థాలకు స్వస్థి చెప్పి, మన పూర్వీకుల నుంచి వస్తున్న భోజనశైలిని అనుసరించాలి.

  • పరిష్కారం మన మూలాల్లోనే...

ఏరోమ్యాటిక్‌ ఆర్థ్రయిటిస్‌, యూరిక్‌ యాసిడ్‌ సంబంధిత ఆర్థ్రయిటిస్‌... ఈ సమస్యలతో బాధపడుతున్నవాళ్లు, ఎంతకూ బరువు తగ్గనివాళ్లు, కండరాల నొప్పులు, ఎముకల నొప్పులు, బలహీనత మొదలైన లక్షణాలతో బాధపడేవాళ్లు తప్పనిసరిగా శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌ను అనుమానించాలి. నిజానికి ఈ సమస్యలకు అసలు కారణాన్ని కనిపెట్టలేక రకరకాల మందులు వాడుకుంటూ ఆరోగ్యాన్ని కుదేలు చేసుకునే వాళ్లూ ఉంటారు. కానీ మూల కారణాన్ని సరిదిద్దుకుంటే ఈ ఇబ్బందులు వాటంతట అవే తొలగిపోతాయి. అందుకోసం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఆహారాన్ని ఎంచుకోవాలి. పాలిష్‌ పట్టని ముడి పదార్థాల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. నొప్పి, వాపులను తగ్గించే పోషకాలు మన స్థానిక పంటల్లో ఉన్నాయి.

Untitled-1 copy.jpg


  • ఇన్‌ఫ్లమేషన్‌ పరీక్షలు ఇవే!

మన సమస్యలకు కారణం ఇన్‌ఫ్లమేషన్‌ అవునో, కాదో తెలుసుకోవడం కోసం, ఇన్‌ఫ్లమేషన్‌ తీవ్రతను పసిగట్టడం కోసం ఇన్‌ఫ్లమేటరీ మార్కర్స్‌ను పరీక్షించాలి. అందుకోసం ‘సి రియాక్టివ్‌ ప్రొటీన్‌ ఐఎల్‌6’ను పరీక్షిస్తే, శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ మోతాదు తెలిసిపోతుంది. మోతాదును బట్టి ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్‌ తీసుకోవడంతో పాటు, ఇన్‌ఫ్లమేషన్‌ను ప్రేరేపించే పదార్థాలను పూర్తిగా మానేయాలి.

  • ఇన్‌ఫ్లమేషన్‌ ఎందుకు?

ఇటీవలి కాలంలో మన ఆహారంలో ప్రాసెస్‌ చేసిన పదార్థాల మోతాదు పెరిగింది. తెల్ల బియ్యం, గోధుమలు, మైదా, వంటనూనెలు, చక్కెర ఇవన్నీ ప్రాసెస్‌ చేసినవే! వీటితో తయారయ్యే బిర్యానీలు, రొట్టెలు, బ్రెడ్లు, స్వీట్స్‌, కేక్స్‌, పిజ్జా వంటి ఆహార పదార్థాలన్నీ ఇన్‌ఫ్లమేషన్‌ కారకాలే! ఇంతకు ముందు ఈ సమస్య ఉండేది కాదు. ఇంట్లో తయారు చేసుకునే వంటకాల్లో దంపుడు బియ్యం, పొట్ట్టు తీయని కందిపప్పు, పెసరపప్పు, పసుపు, వెల్లుల్లి వాడుకుంటూ ఉండేవాళ్లం. కానీ ఇప్పుడు మనం తింటున్న ఆహారంలో 80ు ప్రాసెస్‌ చేసిన పదార్థాలే ఉంటున్నాయి. ప్రాసెస్డ్‌ మీట్‌, రిఫైన్డ్‌ షుగర్స్‌, రిఫైన్డ్‌ ఆయిల్స్‌, ఎక్కువ ఉప్పు, తీపి, నూనెలు కలిసిన పదార్థాలు, డీప్‌ ఫ్రై పదార్థాలు ఎక్కువగా తింటున్నాం. వీటి వల్ల శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ మొదలై, వాపులు, నొప్పుల రూపంలో బయటపడుతూ ఉంటుంది. ఇన్‌ఫ్లమేషన్‌ మూలంగా కార్డియో వ్యాస్క్యులర్‌ సమస్యలు కూడా పెరుగుతాయి. జీర్ణ వ్యవస్థ ఇబ్బందులకు లోనవుతుంది. చర్మ సమస్యలు పెరుగుతాయి.


  • వీటి మోతాదు పెంచాలి

  1. ఒమేగా3 పుష్కలంగా ఉండే సాల్మన్‌, మ్యాకెరల్‌ చేపలు

  2. ఆకుకూరలు వాల్‌నట్స్‌, బాదం

  3. షియా సీడ్స్‌, గుమ్మడి విత్తనాలు, అవిసె గింజలు

  4. యాంటీ ఆక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉండే దానిమ్మ, బెర్రీ, సిట్రస్‌ పండ్లు

  5. పసుపు, దాల్చినచెక్క, వెల్లుల్లి, అల్లం

  6. బ్రౌన్‌ రైస్‌, మిల్లెట్స్‌, హోల్‌ వీట్‌ ఆటా, దంపుడు బియ్యం

  7. సెనగలు, బొబ్బర్లు, అలసందలు

  8. పెరుగు, మజ్జిగ

  9. కోల్డ్‌ ప్రెస్‌డ్‌ ఆయిల్స్‌, గానుగ నూనెలు, బెల్లం,

  10. దంపుడు బియ్యం

  11. ప్రతి రోజూ 5 నుంచి 7 రకాల కూరగాయలు,

  12. పండ్లు తినాలి

  13. వంటకాల్లో పసుపు, దాల్చినచెక్క, అల్లం ఎక్కువగా వాడాలి

  • ఇవి వద్దే వద్దు

  1. హాట్‌ డాగ్‌, సాసేజ్‌, బేకన్‌ లాంటి ప్రాసెస్డ్‌ మీట్స్‌

  2. తెల్లని చక్కెర, హై ఫ్రక్టోజ్‌ కార్న్‌ సిరప్‌ లాంటి

  3. రిఫైన్డ్‌ షుగర్స్‌

  4. లాక్టోజ్‌ ఇంటాలరెన్స్‌ కలిగి ఉండేవాళ్లు పాల

  5. ఉత్పత్తులు తీసుకోకూడదు

  6. సోడియం ఎక్కువగా ఉండే ప్రాసెస్డ్‌, క్యాన్డ్‌ ఫుడ్స్‌

  7. పిజ్జాలు, బర్గర్లు లాంటి బేక్‌ చేసిన స్నాక్స్‌, పదార్థాలు

  8. శీతల పానీయాలు

  9. గ్లూటెన్‌ పడనివాళ్లు గోధుమలు, మైదాలతో తయారయ్యే పదార్థాలకు దూరంగా ఉండాలి


  • విటమిన్‌ డి లోపంతో...

ఇన్‌ఫ్లమేషన్‌కు మరొక ప్రధాన కారణం విటమిన్‌ డి లోపం. కాబట్టి ప్రతి ఒక్కరూ విటమిన్‌ డి మోతాదును పరీక్షించుకుని, అవసరం మేరకు సప్లిమెంట్ల రూపంలో ఈ విటమిన్‌ భర్తీ చేసుకుంటూ ఉండాలి. మనం ప్రధానంగా నిర్లక్ష్యం చేసే మరొక మినరల్‌ మెగ్నీషియం. ఈ లోపాన్ని భర్తీ చేసుకోవడం కోసం గుమ్మడి విత్తనాలు, పుచ్చ విత్తనాలు తీసుకోవాలి.

  • యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్‌తో...

ఈ డైట్‌తో ఒబేసిటీ అదుపులోకి రావడంతో

పాటు మరెన్నో ఆరోగ్యపరమైన ప్రయోజనా లుంటాయి. అవేంటంటే...

తీవ్ర రుగ్మతలు:

  • గుండె జబ్బులు, కేన్సర్లు, ఆటో ఇమ్యూన్‌ ముప్పులు తగ్గుతాయి

  • ఇమ్యూనిటీతో పాటు, చర్మ ఆరోగ్యం, శక్తి మోతాదులు కూడా పెరుగుతాయి

  • క్యాలరీలు తక్కువ, పీచు ఎక్కువ కాబట్టి బరువు తగ్గుతారు

డాక్టర్‌ సుజాత స్టీఫెన్‌

క్లినికల్‌ న్యూట్రిషనిస్ట్‌,

యశోద హాస్పిటల్స్‌,

మలక్‌ పేట, హైదరాబాద్‌.

Updated Date - Nov 05 , 2024 | 01:19 AM