Share News

NRI: రాష్ట్ర ప్రగతిలో ప్రవాసులు ఎప్పుడూ భాగమే

ABN , Publish Date - Dec 25 , 2024 | 08:12 PM

ఎన్ఆర్ఐ ఖతర్ విభాగం ఆధ్వర్యంలో అక్కడి టీడీపీ నేతలు ప్రత్యేక సమావేశంతో పాటు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, భీమిలి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశిష్ట అతిథిగా కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తదితరులు హాజరయ్యారు.

NRI: రాష్ట్ర ప్రగతిలో ప్రవాసులు ఎప్పుడూ భాగమే

ఎన్ఆర్ఐ ఖతర్ విభాగం ఆధ్వర్యంలో అక్కడి టీడీపీ నేతలు ప్రత్యేక సమావేశం కావడంతో పాటు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన కేక్‌ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, భీమిలి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశిష్ట అతిథిగా కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ వెలువరించిన ‘తారకరామం’ పుస్తకంతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జీవిత ప్రస్థానాన్ని తెలియజేస్తూ ప్రముఖ రచయత విక్రమ్ పూల రచించిన ‘మహా స్వాప్నికుడు’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఖతార్‌లో తెలుగువారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని, ప్రపంచ వేదికపై తెలుగువారు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారంటే అందుకు ఎన్టీఆర్, చంద్రబాబే కారణమన్నారు.NTR Cine Vajrotsavam Qatar TDP 2.jpeg


తెలుగు నేలకు గుర్తింపు..

కష్టపడి చదువుకొని అవకాశాలను అందిపుచ్చుకొని నేడు ప్రపంచవేదికపై తెలుగువారు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని గంటా శ్రీనివాసరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో నూతన ఒరవడి ఏర్పడిందని, తెలుగువారి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు అని కొనియాడారు. తెలుగుజాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ చిరస్మరణీయుడిగా ఉంటారని చెప్పారు. ఆయన తెలుగుజాతికి ప్రపంచఖ్యాతి తీసుకొస్తే, చంద్రబాబు నాయుడు తెలుగువారి ప్రతిభను ప్రపంచ నలుమూలలకు పరిచయం చేశారని పేర్కొన్నారు. ప్రపంచ పటంలో తెలుగు నేలకు ఒక గుర్తింపునిచ్చారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు చేతులా ప్రజలకు అందించారని మెచ్చుకున్నారు. విద్యుత్, ఆర్థిక సంస్కరణలతో దేశానికే దిశానిర్దేశం చేశారని, చంద్రబాబు పాలన అంటే పరిశ్రమలు పరుగెత్తుకుంటూ వస్తాయన్నారు.NTR Cine Vajrotsavam Qatar TDP 3.jpeg


ప్రజాసేవే అంతిమ లక్ష్యం

సంపద సృష్టి అన్న దాన్ని పాలనలో ప్రవేశపెట్టిన మేధావి చంద్రబాబు నాయుడు అని గంటా శ్రీనివాసరావు కొనియాడారు. రాజకీయ అంతిమ లక్ష్యం ప్రజాసేవేనని, ప్రవాసులు ఇక్కడి నుంచి కూడా రాష్ట్రం గురించి ఆలోచించి పలు రంగాల్లో చేయూతనందిస్తున్నారని ప్రశంసించారు. ఆ తర్వాత కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ... ప్రవాసులు ఎప్పుడూ రాష్ట్ర ప్రగతిలో భాగమనేని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. రాష్ట్రాభివృద్ధి, యువత భవిత లక్ష్యంగా సాగుతున్న కూటమి పరిపాలనకు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షుడు రావి రాధాకృష్ణ, ఖతార్ టీడీపీ అధ్యక్షుడు జి. రమణయ్య, గల్ఫ్ కౌన్సిల్ మెంబర్ ఎం. సత్య, వైస్ ప్రెసిడెంట్ ఎం. నరేష్, రవి పోనుగుమాటి, గోవర్దన్, విక్రమ్, రమేష్, రవీంద్రతో పాటు కవీంద్ర, అనిల్‌, జనసేన నేత వీరబాబు తదితరులు పాల్గొన్నారు.


Also Read:

ప్రధాని మోదీ సభలో రెపరెపలాడిన తెలుగుదేశం జెండా

టాంటెక్స్ ఆధ్వర్యంలో 'నెల నెలా తెలుగు వెన్నెల' సాహిత్య సదస్సు

దుబాయ్‌లో వేడుకగా ఎన్టీఆర్ సినీవజ్రోత్సవం!

For More NRI And Telugu News

Updated Date - Dec 25 , 2024 | 08:19 PM