Floods: కాకినాడ జిల్లాలో చంద్రబాబు పర్యటన..

ABN, Publish Date - Sep 12 , 2024 | 01:04 PM

తూర్పుగోదావరి జిల్లా: కాకినాడ, జగ్గంపేట నియోజకవర్గం, కిర్లంపూడి మండలం, రాజుపాలెం గ్రామంలో ఏలేరు వరద ముంపు ప్రాంతాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. వరద నీటిలో దిగి, బాధిత ప్రజల ఇళ్లకు వెళ్లి వారికి ధైర్యం చెప్పారు. ‘ఏలేరు వరద బాధితులకు అండగా ఉంటానని ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలన్నారు. ప్రతి వరద బాధిత కుటుంబానికి రూ.10 వేలు సాయం చేస్తానని, తక్షణం దుస్తులు పంపిణీ చేయిస్తానని, పంటలు నష్టపోయిన అన్నదాతలకు హెక్టారుకు రూ.25 వేల సాయం చేస్తామన్నారు. ఎరువులు, పొటాషియం అందిస్తానని, ఇళ్లు దెబ్బతిన్న వారికి ఇళ్లు కట్టిస్తా నని చంద్రబాబు ధైర్యం చెప్పారు. ప్రతిఒక్కరికీ సాధ్యమైనంత వేగంగా సాయం చేస్తామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.

Floods: కాకినాడ జిల్లాలో చంద్రబాబు పర్యటన.. 1/8

రాజుపాలెం గ్రామంలో ఏలేరు వరద ముంపు ప్రాంతాలను పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.

Floods: కాకినాడ జిల్లాలో చంద్రబాబు పర్యటన.. 2/8

కాకినాడ జిల్లాలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు.. అన్ని విధాల వరద బాధితులను ఆదుకుంటామని భరోసా ఇస్తూ.. ప్రసంగిస్తు్న్న ముఖ్యమంత్రి..

Floods: కాకినాడ జిల్లాలో చంద్రబాబు పర్యటన.. 3/8

వరద నీటిలో నడుచుకుంటూ వెళుతూ.. బాధిత ప్రజలకు ధైర్యం చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..

Floods: కాకినాడ జిల్లాలో చంద్రబాబు పర్యటన.. 4/8

వరద ముంపుకు గురైన బాధిత ప్రజల ఇళ్లకు వెళ్లి వారికి ధైర్యం, భరోసా కల్పిస్తున్న సీఎం చంద్రబాబు..

Floods: కాకినాడ జిల్లాలో చంద్రబాబు పర్యటన.. 5/8

జేసీబీలో కూర్చోని వరద ముంపు ప్రాంతాలను పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు..

Floods: కాకినాడ జిల్లాలో చంద్రబాబు పర్యటన.. 6/8

సీఎం చంద్రబాబు రాజుపాలెం గ్రామాన్ని ముంచిన ఏలేరు వరదను పరిశీలిస్తున్న దృశ్యం..

Floods: కాకినాడ జిల్లాలో చంద్రబాబు పర్యటన.. 7/8

వరద ప్రభావ పరిస్థితులను సీఎం చంద్రబాబుకు వివరిస్తున్న స్థానికులు..

Floods: కాకినాడ జిల్లాలో చంద్రబాబు పర్యటన.. 8/8

ప్రజా సేవకుడు సీబీఎన్ సార్ అంటూ విద్యార్థులు ఫ్లకార్డులు ప్రదర్శిస్తున్న దృశ్యం...

Updated at - Sep 12 , 2024 | 01:04 PM