యాదాద్రి గిరిప్రదక్షిణలో అయ్యప్ప స్వాములు
ABN, Publish Date - Dec 11 , 2024 | 11:09 AM
యాదాద్రి: తెలంగాణలో ప్రముఖ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి గిరిప్రదక్షిణలో పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. అయ్యప్పస్వామి దీక్ష చేపట్టిన మాలధారణ భక్తుల సామూహిక గిరి ప్రదక్షిణ పర్వం బుధవారం భారీ ఎత్తున జరిగింది. వేకువ జామున కొండకింద వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, గిరి ప్రదక్షిణ చేపట్టారు. కాగా గుట్ట చరిత్రలోనే తొలిసారిగా ఆలయ అధికారులు అయ్యప్పస్వాములకు ప్రత్యేక దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఆలయ ఈవో భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
Updated at - Dec 11 , 2024 | 11:10 AM