CM Revanth Reddy: పాలమూరు జిల్లాపై కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి..

ABN, Publish Date - Nov 10 , 2024 | 05:28 PM

పాలమూరు అభివృద్ధిని అడ్డుకోవాలని కొందరు చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. తమ పాలనలోనైనా పాలమూరును అభివృద్ధి చేసుకోనివ్వండంటూ ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్బంగా సూచించారు. ఈ జిల్లా 12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఒక సీఎంను ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.

CM Revanth Reddy: పాలమూరు జిల్లాపై కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. 1/11

పాలమూరు జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్‌లోని కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.

CM Revanth Reddy: పాలమూరు జిల్లాపై కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. 2/11

ఈ సందర్భంగా రూ.110 కోట్లతో ఆలయ ఘాట్ రోడ్డు కారిడార్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.

CM Revanth Reddy: పాలమూరు జిల్లాపై కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. 3/11

అనంతరం మహబూబ్‌నగర్‌‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇప్పటికీ కురుమూర్తి ఆలయంలో మౌలిక సదుపాయాలు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

CM Revanth Reddy: పాలమూరు జిల్లాపై కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. 4/11

కురుమూర్తి ఆలయానికి ఏం కావాలో కలెక్టర్ నివేదిక ఇస్తే నిధులు మంజూరు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పేదల తిరుపతిగా కురుమూర్తి ఆలయాన్ని కొలుస్తారని ఆయన చెప్పారు.

CM Revanth Reddy: పాలమూరు జిల్లాపై కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. 5/11

గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పాలమూరులో ప్రాజెక్టులు సైతం పూర్తి కాలేదని సీఎం అన్నారు. పాలమూరుకు విద్య, వైద్యం, ఉపాధి కోసం నిరంతరం కృషి చేస్తామని చెప్పారు.

CM Revanth Reddy: పాలమూరు జిల్లాపై కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. 6/11

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో జిల్లాకు పరిశ్రమలు, ప్రాజెక్టులు రాలేదని, ఈ ప్రాంతంలో ఇంకా వలసలు కొనసాగుతూనే ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

CM Revanth Reddy: పాలమూరు జిల్లాపై కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. 7/11

పాలమూరు అభివృద్ధిని అడ్డుకోవాలని కొందరు చూస్తున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇప్పటికైనా తమ పాలనలో పాలమూరును అభివృద్ధి చేసుకోనివ్వాలంటూ ప్రతిపక్షాలకు ఆయన సూచించారు.

CM Revanth Reddy: పాలమూరు జిల్లాపై కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. 8/11

పాలమూరు జిల్లా 12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఒక సీఎంను ఇచ్చిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా రుణం తీర్చుకుంటామని సీఎం స్పష్టం చేశారు.

CM Revanth Reddy: పాలమూరు జిల్లాపై కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. 9/11

గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పాలమూరుకు తీవ్ర అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు బిడ్డనై ఉండి.. ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే ప్రజలు తనను క్షమించరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

CM Revanth Reddy: పాలమూరు జిల్లాపై కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. 10/11

పాలమూరు యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. తమ పరిశ్రమలో 2 వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని అమర్‌రాజా సంస్థ హామీ ఇచ్చిందని ఆయన తెలిపారు.

CM Revanth Reddy: పాలమూరు జిల్లాపై కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. 11/11

జిల్లాలో గ్రామ గ్రామానికి, తండాలకు బీటీ రోడ్లు వేసే బాధ్యత తనదని రేవంత్ చెప్పారు. ఈ సందర్భంగా బీటీ రోడ్ల నిర్మాణాలకు అంచనాలు తయారు చేయాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Updated at - Nov 10 , 2024 | 05:34 PM