Floods: ముంపుకు గురైన కాలేజీని పరిశీలించిన ప్రొ. కోదండరాం

ABN, Publish Date - Sep 13 , 2024 | 11:49 AM

ఖమ్మం: నగరంలోని నయాబజార్ కళాశాల వరదల్లో మునగటంతో ఆ కాలేజీని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పరిశీలించారు. ఫైల్స్, కంప్యూటర్లు అన్ని తడిసిపోయాయి. వాటన్నింటిని ఆయన పరిశీలించారు. అనంతరం కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన శిబిరంలో వరద బాధితులకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. తర్వాత బొక్కల గడ్డ, రాజీవ్ గృహకల్ప తదితర ప్రాంతాలలో పర్యటించి బాధితుల కష్టాలను ప్రత్యక్షంగా చూశారు. ఘటన జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్నేరు వరద బాధితులకు ఎంత సహాయం చేసినా అది తక్కువే అవుతుందని కోదండరాం అన్నారు.

Floods: ముంపుకు గురైన కాలేజీని పరిశీలించిన ప్రొ. కోదండరాం 1/8

ఖమ్మం నగరంలోని నయాబజార్ కళాశాల వరదల్లో మునగటంతో ఆ కాలేజీని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పరిశీలించారు.

Floods: ముంపుకు గురైన కాలేజీని పరిశీలించిన ప్రొ. కోదండరాం 2/8

అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్న ప్రొఫెసర్ కోదండరాం..

Floods: ముంపుకు గురైన కాలేజీని పరిశీలించిన ప్రొ. కోదండరాం 3/8

వరదలకు కాలేజీలోని కంప్యూటర్లు అన్ని తడిసి పాడైపోయాయి.. వాటిని పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం..

Floods: ముంపుకు గురైన కాలేజీని పరిశీలించిన ప్రొ. కోదండరాం 4/8

వరదలకు నయాబజార్ కళాశాలకు చెందిన ఫైల్స్ తడిపి పాడైపోయాయి.. వాటిని పరిశీలిస్తున్న ప్రొఫెసర్ కోదండరాం..

Floods: ముంపుకు గురైన కాలేజీని పరిశీలించిన ప్రొ. కోదండరాం 5/8

ప్రొఫెసర్ కోదండరాం.. కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన శిబిరంలో వరద బాధితులకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్న దృశ్యం..

Floods: ముంపుకు గురైన కాలేజీని పరిశీలించిన ప్రొ. కోదండరాం 6/8

మున్నేరు వరద బాధితులకు ఎంత సహాయం చేసినా అది తక్కువే అవుతుందని కోదండరాం వ్యాఖ్యానించారు.

Floods: ముంపుకు గురైన కాలేజీని పరిశీలించిన ప్రొ. కోదండరాం 7/8

ఖమ్మంలో వరదలకు జలగం నగర్‌లో ఎండివో ఆఫీస్ వరద నీటిలో మునిగిపోయింది. అందులో కంప్యూటర్లు తడిసి పాడైపోయాయి.

Floods: ముంపుకు గురైన కాలేజీని పరిశీలించిన ప్రొ. కోదండరాం 8/8

ఖమ్మం రూరల్ మండలం, జలగం నగర్‌లో ఎండివో ఆఫీసు వరద నీటిలో మునిగిపోయింది.. ఆఫీస్ లో ఉన్న ఫైల్స్ పూర్తిగా తడిసిపోయాయి..

Updated at - Sep 13 , 2024 | 11:49 AM