AP Politics: చంద్రబాబు ఇటు రాగానే హస్తినకు జగన్.. ఏదో తేడా కొడుతోందో..?
ABN , Publish Date - Feb 08 , 2024 | 03:53 PM
AP Politics Heat With Delhi Tours: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (AP Politics) రోజురోజుకూ హీట్ పెంచేస్తున్నాయి. రాష్ట్రంలో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలియని పరిస్థితి. అధికార వైసీపీ (YSR Congress), ప్రతిపక్షాల టీడీపీ, జనసేన, బీజేపీ (TDP, Janasena, BJP) అధినేతల నిర్ణయాలతో శరవేగంగా పరిస్థితులు మారిపోతున్నాయి. టీడీపీ-జనసేన పొత్తుగా 2024 ఎన్నికల్లో (2024 Elections) పోటీ చేస్తుండగా.. ఇప్పుడు బీజేపీ కూడా దాదాపు జత కట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (AP Politics) రోజురోజుకూ హీట్ పెంచేస్తున్నాయి. రాష్ట్రంలో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలియని పరిస్థితి. అధికార వైసీపీ (YSR Congress), ప్రతిపక్షాల టీడీపీ, జనసేన, బీజేపీ (TDP, Janasena, BJP) అధినేతల నిర్ణయాలతో శరవేగంగా పరిస్థితులు మారిపోతున్నాయి. టీడీపీ-జనసేన పొత్తుగా 2024 ఎన్నికల్లో (2024 Elections) పోటీ చేస్తుండగా.. ఇప్పుడు బీజేపీ కూడా దాదాపు జత కట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఢిల్లీ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu).. బీజేపీ పెద్దలు అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశమై పొత్తులపై లోతుగా చర్చించారు. ఈ చర్చలు సఫలం కాగా.. ఇక పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు కేటాయించాలి..? ఏయే సీట్లు ఇవ్వాలి..? అనేది క్లియర్ అవ్వగానే అధికారిక ప్రకటన ఉంటుందని టీడీపీ, బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే.. 2014 పొత్తులో భాగంగా బీజేపీ పోటీచేసిన సీట్లతో పాటు.. మరికొన్ని అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లను ఎక్కువగా అడుగుతున్నట్లు తెలియవచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ముందుగా రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి అభ్యర్థిని పోటీకి దింపాలని యోచిస్తున్నట్లు తెలియవచ్చింది. సీఎం రమేష్‌ను లేదా సుజనా చౌదరిని బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దించే అవకాశముంది.
ఎక్కడ చూసినా ఇదే చర్చ!
ఢిల్లీ పర్యటన ముగించుకుని చంద్రబాబు ఇటు హైదరాబాద్‌కు రాగానే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ (YS Jagan Delhi Tour) వెళ్తున్నారు. గురువారం సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో సీఎం ఢిల్లీ పయనం కానున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో జగన్ సమావేశం అవుతారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్రాభివృద్ధిపై మోదీతో చర్చలు జరుపుతారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే.. రాజకీయ పరమైన అంశాలే ప్రధానంగా చర్చించే అవకాశముందని వార్తలు గుప్పుమంటున్నాయి. చంద్రబాబు ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే జగన్ వెళ్తుండటంతో గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పెద్ద చర్చే జరుగుతోంది. మొత్తానికి జగన్ ఢిల్లీ పర్యటన రాజకీయాలను వేడి పుట్టిస్తున్నాయి. సీఎం హస్తిన పర్యటన సంగతేమో కానీ.. దీనిపై వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చే జరుగుతోంది.
BRS: వైరల్ అవుతున్న కేసీఆర్ మీటింగ్ ఫొటో.. ఎక్కడ చూసినా ఇదే చర్చ.. రచ్చ!
AP Politics: ఢిల్లీకి చంద్రబాబు.. కేంద్రంపై స్వరం మార్చేసిన వైఎస్ జగన్.. సడన్‌గా ఎందుకిలా..?
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి
ఏదో తేడాగానే ఉందే..?
ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది కాబట్టే చంద్రబాబు వెళ్లి అమిత్ షాను కలిశారు. మరి జగన్‌కు ఎవరి నుంచి పిలుపు వచ్చింది..? చంద్రబాబు పర్యటన తర్వాతే జగన్ ఎందుకు వెళ్తున్నారు..? అసలు ఎందుకు వెళ్లాల్సి వస్తోంది..? అనేది పెరుమాళ్లకే ఎరుక. ఇటీవల అసెంబ్లీ వేదికగా కేంద్రం నుంచి నిధులు రావట్లేదని.. ఇచ్చిన నిధుల్లో కూడా కోతలు పెడుతోందని మోదీ ప్రభుత్వంపై మొదటిసారిగా జగన్ ఒకింత టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. దీంతో.. కేంద్రంలోని పెద్దలు కన్నెర్రజేసి పిలిపిస్తున్నారా? లేకుంటే ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగనే స్వయంగా ఢిల్లీ వెళ్తున్నారా అనేదానిపై ఇంతవరకూ క్లారిటీ రాలేదు. పైగా మోదీతో అపాయిట్మెంట్ కూడా ఇంకా ఫిక్స్ కాలేదు. దీంతో హస్తిన వేదికగా ఏం జరుగుతోంది..? అనేదానిపై ఎలాంటి క్లారిటీ రావట్లేదు. ఒక్కరోజు గ్యాప్‌లోని రెండు పార్టీల అధినేతలతో బీజేపీ పెద్దలు సమావేశం అవుతుండటం ఏదో తేడాగానే ఉందని మాత్రం జనాలు గట్టిగానే చర్చించుకుంటున్నారు.