Share News

BJP: బీజేపీలోకి బీఆర్ఎస్ ఎంపీ!.. అన్నీ అనుకూలిస్తే ఈ రోజు జంప్!

ABN , Publish Date - Feb 29 , 2024 | 04:08 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నాటి నుంచి నేతల వలసలతో బెంబేలెత్తిపోతున్న బీఆర్ఎస్‌కు (BRS) మరో ఎదురుదెబ్బ తగలనుందా?. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కేసీఆర్ (KCR) సారధ్యంలోని గులాబీ దళానికి మరో షాక్ తగలనుందా?. కీలక ఎంపీ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. సీనియర్ రాజకీయ నాయకుడు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ (BB Patil) బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో (BJP) చేరాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.

BJP: బీజేపీలోకి బీఆర్ఎస్ ఎంపీ!.. అన్నీ అనుకూలిస్తే ఈ రోజు జంప్!

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నాటి నుంచి నేతల వలసలతో బెంబేలెత్తిపోతున్న బీఆర్ఎస్‌కు (BRS) మరో ఎదురుదెబ్బ తగలనుందా?. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కేసీఆర్ (KCR) సారధ్యంలోని గులాబీ దళానికి మరో షాక్ తగలనుందా?. కీలక ఎంపీ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారా? అంటే ఔననే సమాధానం వస్తోంది.

సీనియర్ రాజకీయ నాయకుడు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ (BB Patil) బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో (BJP) చేరాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఢిల్లీలో బీజేపీ నాయకత్వంతో మంతనాలు జరుపుతున్నట్టుగా సమాచారం. అన్నీ అనుకూలిస్తే ఈ రోజే (గురువారం) పోతుగంటి రాములుతో (Pothuganti Ramulu) కలిసి కాషాయ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. బీబీ పాటిల్ మరోసారి జహీరాబాద్ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని, ఈ టికెట్ ఆశిస్తున్నారని తెలుస్తోంది. అయితే టికెట్‌ విషయంలో గ్యారంటీ ఇవ్వలేమని రాష్ట్ర బీజేపీ నాయకత్వం చెబుతున్నట్టుగా సమాచారం. దీంతో ఆయన ఊగిసలాటలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

కాగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలోకి (Congress) పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ పరిణామం బీఆర్ఎస్‌కు ప్రతికూలంగా మారడం ఖాయమని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఇవి కూడా చదవండి..

Telangana: ధరణి మార్గదర్శకాలు విడుదల.. కీలక బాధ్యతలన్నీ కలెక్టర్లకే..

TS News: భద్రాద్రి రామాలయంలో వెలుగుచూసిన భారీ మోసం

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 29 , 2024 | 04:12 PM