Chandrababu: అంబటి వీడియో చూపించి.. పగలబడి నవ్విన చంద్రబాబు!
ABN , Publish Date - Jun 28 , 2024 | 06:11 PM
అవును.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) నవ్వారు..! అది కూడా మామూలు నవ్వు కాదండోయ్ పగలబడి మరీ నవ్వారు..!
అవును.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) నవ్వారు..! అది కూడా మామూలు నవ్వు కాదండోయ్ పగలబడి మరీ నవ్వారు..! ఇంకా చెప్పాలంటే గ్యాప్ లేకుండా నవ్వేశారు సీబీఎన్..! ఈ పరిణామంతో టీడీపీ శ్రేణులు, తెలుగు తమ్ముళ్లు ఆనందంలో మునిగి తేలుతున్నారు. అబ్బా.. ఎన్నాళ్లకెన్నాళ్లకు, బాబు నవ్వడం చూసి ఎన్నేళ్లయ్యిందో అని టీడీపీ నేతలు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇంతకీ ఇంత పడి పడి నవ్వేంత సీన్ ఏం జరిగిందబ్బా..? అనే కదా మీ సందేహం.. ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి.. తెలుసుకుందాం..!
ఏపీ పోలీసుల తీరు మారలేదే!
ఇదీ అసలు కథ..!
వైసీపీ ప్రభుత్వం హయాంలో అవినీతిని వెలికి తీస్తున్న చంద్రబాబు సర్కార్.. శనివారం నాడు ఏపీ జీవనాడి ‘పోలవరం’ ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో నీటి పారుదల శాఖా మంత్రి అంబటి రాంబాబు వీడియోను ప్లే చేసి చూపించి మరీ నవ్వుకున్నారు.. చంద్రబాబు. ‘ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్. అంత తేలికగా అర్థం కాదు. ఏంటి అర్థం కాదని చెబుతున్నానంటే.. అవును నాకు అర్థం కాలేదు కాబట్టే చెబుతున్నాను. నేను అనేకసార్లు ప్రాజెక్ట్ విజిట్ చేసి, స్టడీ చేసి, అనేకమంది సలహాదారులతో మాట్లాడిన తర్వాత ఇది ఇప్పట్లో అయ్యే ప్రాజెక్ట్ కాదని నేను నిర్ణయం తీసుకున్నాను. ఈ మాట చెప్పిన మొదటి వ్యక్తిని నేనే’ అని అంబటి రాంబాబు చెప్పిన మాటలు ఆ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియో ప్లే అవుతున్నంతసేపు.. చంద్రబాబు అస్సలు నవ్వు ఆపుకోలేకపోయారు. ఎంతలా అంటే.. పగలబడి నవ్వేశారు. దీంతో పక్కనున్న మంత్రులు, అధికారులు సైతం నవ్వేశారు.
ఎంత హాస్యాస్పదమో..!
ఈ వీడియో ప్లే చేసి చూపించిన చంద్రబాబు.. చూశారుగా పోలవరం ప్రాజెక్ట్ అంటే ఎంత హాస్యమైందో అని అంబటి, వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇదొక్కటే కాదు ఇదే కార్యక్రమంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం గురించి మాట్లాడిన మాటలను కూడా ‘పోలవరం ప్రాజెక్టుపై నాటి వైసీపీ ప్రభుత్వం మోసపు ప్రకటనలు’ అని వీడియో రూపంలో వినిపించారు. ఇందులో 2021, 2022, 2023 ఈ మూడుసార్లు కూడా ఖరీఫ్‌కు ప్రాజెక్టు అయిపోతుందనే మాటలు ఈ వీడియోలో ఉన్నాయి. అంతేకాదు చివరికి 2025 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందనే మాటలు కూడా ఇందులోనే ఉన్నాయి. చూశారుగా.. ఇదీ పోలవరం ప్రాజెక్టు గురించి వైసీపీకి ఉన్న చిత్త శుద్ధి అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. వాస్తవానికి గత నాలుగైదేళ్లుగా చంద్రబాబు ఈ రేంజిలో నవ్విన, నవ్వుకున్న సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. అందుకే తాజా పరిణామంతో ఇక చూస్కోండి టీడీపీ శ్రేణులు, సామాన్యులు తెగ నవ్వుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
లెక్కలు తీశారుగా..!
ఈ శ్వేతపత్రం రిలీజ్ సందర్భంగా ఇప్పటి వరకూ ప్రాజెక్ట్‌కు ఎన్ని కోట్ల ఖర్చు చేశారనే దానిపై లెక్కలు తీసి మరీ వివరించారు. పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అని, అలాంటి ప్రాజక్టును 5 ఏళ్లపాటు (2019-24) ఎలా విధ్వంసం చేసారో ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పడు పోలవరం పనులు ఒక యజ్ఞంలా సాగాయని, అప్పట్లో ఉన్న సమస్యలను, సవాళ్లను అధిగమించి మరీ ముందుకు వెళ్లామని చంద్రబాబు గుర్తుచేశారు. ఒక్క రోజులోనే స్పిల్ ఛానల్‌లో 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి నాటి ప్రభుత్వం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిందని చంద్రబాబు గుర్తుచేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అటు హెడ్ వర్కుల పనులు చేస్తూనే ఎగువ, దిగువ కాఫర్ కాఫర్ డ్యాంల నిర్మాణం పనులు పూర్తి చేశామని చెప్పారు. ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని రికార్డు సమయంలో 414 రోజుల్లో పూర్తి చేశామని చంద్రబాబు ప్రస్తావించారు.
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి..